Har Shikhar Tiranga: సీతమ్మ కొండపై ‘హర్ శిఖర్ తిరంగా’ : సీతమ్మ కొండపై ‘హర్ శిఖర్ తిరంగా’

అల్లూరి సీతారామరాజు జిల్లా హకుంపేట మండలంలోని సీతమ్మ (అర్మ) కొండపైకి వెళ్లి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించేందుకు సర్వం సిద్ధమైంది. అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అన్ని రాష్ట్రాల్లోని అత్యున్నత శిఖరాలపై జాతీయ జెండా ఎగురవేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ‘హర్ శిఖర్ తిరంగా’ మిషన్ పనిచేస్తోంది.
AP Tops in capital Expenditure: మూలధన వ్యయంలో ఏపీ టాప్
పర్వత ప్రాంతాల్లో సాహసయాత్ర చేసి.. జాతీయ జెండా ఎగురవేయడం దీని ప్రధాన ఉద్దేశం. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ (నిమాస్) డైరెక్టర్ కల్నల్ రణవీర్‌సింగ్ జమ్వాల్ నాయకత్వంలో ఈ నెల 4వ తేదీ సోమవారం 15 మందితో కూడిన ఆర్మీ బృందం అర్మ కొండపై యాత్ర చేపట్టి జాతీయ జెండా ఎగురవేయనుంది. ఈ కార్యక్రమానికి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణకు చెందిన పర్వతారోహకుడు సాధనపల్లి ఆనంద్‌కుమార్ హాజరవుతారు.
National Accreditation Board for Hospitals: విశాఖపట్నం ఆస్పత్రికి ఎన్‌ఏబీహెచ్ గుర్తింపు