National Accreditation Board for Hospitals: విశాఖపట్నం ఆస్పత్రికి ఎన్‌ఏబీహెచ్ గుర్తింపు
రోగులకు అందిస్తున్న అత్యుత్తమ వైద్య సేవలకు గానూ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్, హెల్త్‌కేర్ ప్రొవైడర్స్(ఎన్‌ఏబీహెచ్) గుర్తింపు దక్కింది. తద్వారా దేశంలోనే ఎన్‌ఏబీహెచ్ గుర్తింపు పొందిన తొలి ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆస్పత్రిగా విశాఖ మానసిక ఆస్పత్రి రికార్డును కైవసం చేసుకుంది.ఈ గుర్తింపు 2027 ఆగస్టు తొమ్మిదో తేదీ వరకు అధికారికంగా ఉంటుంది.
ఎన్‌ఏబీహెచ్ అంటే ఏమిటి
దేశంలో నాణ్యమైన వైద్యసేవల కల్పన, ఆస్పత్రుల్లో నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణ కోసం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎన్‌ఏబీహెచ్‌ను నెలకొల్పింది. ఎన్‌ఏబీహెచ్ గుర్తింపు ఇచ్చేందుకు ఒక రోగి ఆస్పత్రిలోకి అడుగు పెట్టినప్పటి నుంచి వైద్యం చేయించుకుని తిరిగి వెళ్లే వరకు అందిస్తున్న సేవలు, భద్రత, ఆస్పత్రి నిర్వహణ, వైద్యులు, సిబ్బంది పనితీరు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.
రోగుల సేవల్లో భాగంగా ఆస్పత్రిలో ఫ్రెండ్లీ, ఆహ్లాదకర వాతావరణం, సెక్యూరిటీ, శానిటేషన్ పక్కాగా నిర్వహణ, ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా చేపట్టిన చర్యలు, ఆస్పత్రుల నుంచి వెలువడే వ్యర్థాలను సక్రమంగా నిర్వహిస్తున్నారా? లేదా? అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది.
Solar Dehydration Units in AP: ఏపీలో సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లు