Skip to main content

Foundation stone for Central Tribal University in AP: ఏపీలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాల‌యానికి శంకుస్థాపన

Foundation stone for Central Tribal University
Foundation stone for Central Tribal University

 పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం చినమేడపల్లిలో రూ.830 కోట్ల ఖర్చుతో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శాశ్వత భవనాల నిర్మాణానికి, ఇతర మౌలిక వసతుల కల్పనకు శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.

Renewable Energy Projects in AP: ఏపీలో రూ.25,850 కోట్లతో పునరుత్పాదక ప్రాజెక్టులు..ఎక్క‌డంటే?

అందించే కోర్సులు 

ఈ విశ్వవిద్యాలయంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఇంగ్లిష్, సోషియాలజీ, ట్రైబల్‌ స్టడీస్, బయోటెక్నాలజీ, కెమెస్ట్రీ, జర్నలిజం, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, డిగ్రీ స్థాయిలో ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, బి.కామ్‌లో ఒకేషనల్‌ తదితర 14 కోర్సులను అందిస్తారు. వీటితో పాటు స్కిల్‌ డెవలప్‌మెంట్, ఒకేషనల్, జాబ్‌ ఓరియెంటెడ్‌ షార్ట్‌ టర్మ్‌ కోర్సులను కూడా అందిస్తారు. గిరిజన తెగల వ్యక్తిగత, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధిని ఈ యూనివర్సిటీ ద్వారా ప్రోత్సహిస్తారు. 

Solar Dehydration Units in AP: ఏపీలో సోలార్‌ డీ హైడ్రేషన్‌ యూనిట్లు

 

Published date : 26 Aug 2023 12:11PM

Photo Stories