Skip to main content

YS Jagan Mohan Reddy: గిరిజనుల్లో విద్యా కాంతులు

గిరిజనులు స్వచ్ఛమైన మనసు కలిగిన కల్మషం లేని మనుషులు. తరతరాలుగా వారిని పేదరికం వెంటాడుతోంది.
Foundation stone laid for Central Tribal University in AP
వర్సిటీ భవనాల నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌. శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్న సీఎం జగన్‌ తదితరులు

 ఇప్పటికీ మిగతా ప్రపంచంతో సమం కాని జీవన ప్రమాణాలు వారివి. వారి జీవితాలను మార్చే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో బాహ్య ప్రపంచంతో అడుగులు వేసే విషయంలో ఇంకా వెనుకబడే ఉన్నారు. ఈ నాలుగేళ్ల పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో పాటు, సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా వారిని గుండెల్లో పెట్టుకుని అడుగులు వేశాం. నాలుగేళ్లలో 58.39 లక్షల గిరిజన కుటుంబాలకు డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా రూ.16,805 కోట్ల లబ్ధి చేకూర్చామని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

చదవండి: US telugu Students: యూఎస్‌ తెలుగు విద్యార్థుల ఉదంతంపై సీఎం జగన్ ఆరా

సాక్షి ప్రతినిధి, విజయనగరం : కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం స్థాపన ద్వారా గిరిజనుల జీవితాల్లో గొప్ప మార్పునకు నాంది పలికామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. గిరిజనుల్లో విద్యాకాంతులు నింపే ఈ ప్రాజెక్టును రూ.830 కోట్ల ఖర్చుతో మూడేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం చినమేడపల్లిలో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శాశ్వత భవనాల నిర్మాణానికి, ఇతర మౌలిక వసతుల కల్పనకు ఆగ‌స్టు 25న‌ ఆయన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.

అందుకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. అంతకు ముందు విశాఖపట్నం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ముఖ్యమంత్రి ఘనంగా స్వాగతం పలికి, ఆయనతో కలిసి నేరుగా  చినమేడపల్లికి హెలికాప్టర్‌లో చేరుకున్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని మరడాం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

చదవండి: Department of Higher Education: ఉన్నత విద్యలో 'గేమ్‌ చేంజర్‌'

రాష్ట్ర విభజన చట్టం ప్రకా­రం ఈ విశ్వవిద్యాలయం వచ్చిందని, రాష్ట్రంలో రెండవ సెంట్రల్‌ వర్సిటీ అని చెప్పారు. గిరిపుత్రుల జీవితాల్లో ఉన్నత విద్యాకాంతులు నింపడానికి రాబోయే రోజుల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గిరిజన మిత్రుడిగా, గిరిజన పక్షపాతిగా మన గిరిజనులు ప్రపంచంతో పోటీపడేలా గొప్ప అడుగుకు బీజం పడబోతోందని చెప్పారు. తనను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి మీ తమ్ముడిగా, అన్నగా, బిడ్డగా రుణపడి ఉంటానన్నారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  

నాలుగేళ్లుగా గుండెల్లో పెట్టుకున్నాం 

  • ఈ నాలుగేళ్లలో గిరిజనుల అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేశాం. వారిని గుండెల్లో పెట్టుకున్నాం. అన్ని విధాలా అండగా నిలబడ్డాం. వారిని తోటి ప్రపంచంలో నిలబెట్టే సంకల్పంతో అడుగులు ముందుకు వేశాం.  
  • తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరుల కోసం ప్రాథమిక విద్య మొదలు ఉన్నత విద్య వరకు అన్ని దశల్లోనూ అండగా నిలుస్తున్నాం. మీడియం నుంచి మౌలిక సదుపాయాల వరకు అన్నింటిలోనూ ఈ నాలుగేళ్లలో విప్లవాత్మక మార్పులతో అడుగులు ముందుకు వేశాం.  
  • గిరిపుత్రుల అభివృద్ధి పట్ల మనందరి ప్రభుత్వం ఎంతో బాధ్యతగా, దూరదృష్టితో వ్యవహరిస్తోంది. వారి విద్యా సాధికారత కోసం, తోటి పోటీ ప్రపంచంలో గెలవాలని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్‌ అనే కాన్సెప్ట్‌ అమలవుతోంది. నాడు–నేడుతో వారు చదువుతున్న స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మారాయి. విద్యాకానుకతో బడిపిల్లల రూపాన్ని, బైలింగువల్‌ విధానంతో వారి టెక్టŠస్‌ బుక్స్‌నూ మార్చగలిగాం.  
  • ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్‌ రూమ్‌ను డిజిటలైజ్‌ చేస్తున్నాం. ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌ (ఐఎఫ్‌పీ)లను ఏర్పాటు చేస్తున్నాం. 8వ తరగతి పిల్లలందరికీ ట్యాబ్స్‌ ఇచ్చే కార్యక్రమం ఒక్క మన రాష్ట్రంలోనే జరుగుతోంది. కల్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాలను చదువును ప్రోత్సహించేలా తీసుకొచ్చాం. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్యలో విద్యా దీవెన, వసతి దీవెన తీసుకొచ్చాం. 
  • మెరుగైన చదువులు, కరిక్యులమ్‌లో మార్పులతో పిల్లలకు విద్యను అందుబాటులోకి తెచి్చన ఘనత ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే దక్కుతుంది. విదేశీ విద్యా దీవెనలో భాగంగా ప్రపంచంలోని టాప్‌ 50 వర్సిటీల్లోని 21 ఫ్యాకలీ్టలకు వర్తింపజేస్తున్నాం. మొత్తంగా 350 కాలేజీల్లో సీటు సంపాదించుకుంటే చాలు రూ.1.25 కోట్ల వరకు మన పిల్లలకు అండగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే. 
Published date : 26 Aug 2023 03:05PM

Photo Stories