Skip to main content

Tribal University: యూనివర్సిటీ ఏర్పాటుపై జీవో విడుదల చేయాలి

Tribal University
యూనివర్సిటీ ఏర్పాటుపై జీవో విడుదల చేయాలి

ఖానాపూర్‌: గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ చేసిన ప్రకటనలకే పరిమితం కాకుండా అధికారికంగా జీవో విడుదల చేయాలి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన ఉట్నూర్‌లో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. గతంలోనే యూనివర్సిటికీ కావాల్సిన స్థలాన్ని ఉట్నూర్‌లో సేకరించారు.
– అజ్మీరా రేఖానాయక్‌, ఎమ్మెల్యే, ఖానాపూర్‌


కేంద్రానికి గిరిజనుల విద్యపై చిత్తశుద్ధి లేదు

ఆదిలాబాద్‌రూరల్‌: గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలని కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసేది. ఎన్నికల్లో గిరిజనుల ఓట్లు దండుకునేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది బూటకపు హామీ మాత్రమే.
– కుమ్ర రాజు, కుమురం సూరుయువ సేన జిల్లా అధ్యక్షుడు


ఏళ్ల నాటి కల నెరవేరింది

పాతమంచిర్యాల: యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మోదీ ప్రకటించడం హర్షదాయకం. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఏళ్లుగా ఎదురుచూశాం. ఎట్టకేలకు కల నెరవేరింది. గిరిజనులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుంది. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లలేనివారికి ఇది మంచి అవకాశం. గిరిజన నిరుపేద విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశం. ఏళ్లనాటి కల నెరవేరింది.
– ఎర్మ పున్నం, ఆదివాసీ గిరిజన

Published date : 02 Oct 2023 03:37PM

Photo Stories