Renewable Energy Projects in AP: ఏపీలో రూ.25,850 కోట్లతో పునరుత్పాదక ప్రాజెక్టులు..ఎక్కడంటే?
విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఒప్పందాలను శరవేగంగా కార్యాచరణలోకి తెస్తూ నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్ల విలువైన మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం వర్చువల్ విధానంలో భూమి పూజ నిర్వహించారు.
మరో రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల (పీఎస్పీ) ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్‌కో), కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) మధ్య ఒప్పందం కుదిరింది. ఈమేరకు సీఎం జగన్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై ఏపీ జెన్‌కో ఎండీ చక్రధరబాబు, ఎన్‌హెచ్‌పీసీ ఫైనాన్స్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ గోయల్ సంతకాలు చేశారు.
AP Maritime Board: పర్యాటక ప్రదేశాలుగా ఏపీ ఫిషింగ్ హార్బర్లు
► రూ.10,350 కోట్ల పెట్టుబడి, 2,300 మెగావాట్ల సామర్థ్యంతో గ్రీన్‌కో కంపెనీ నిర్మించే సౌర విద్యుత్ ప్రాజెక్టు. దీనిద్వారా 2,300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.
► 1,014 మెగావాట్లతో ఆర్సిలర్ మిట్టల్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ నిర్మించే ప్రాజెక్టుకు శంకుస్ధాపన. ఇందులో 700 మెగావాట్లు సోలార్ పవర్ కాగా 314 మెగావాట్లు
విండ్ పవర్ ఉత్పత్తి. రూ.4,500 కోట్ల పెట్టుబడితో 1,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.
► ఎకోరన్ ఎనర్జీ 2 వేల మెగావాట్ల (1,000 మె.వా. సోలార్, 1,000 మె.వా. విండ్ పవర్) సామర్ధ్యంతో నిర్మించనున్న ప్రాజెక్టుకు శంకుస్ధాపన. దాదాపు రూ.11 వేల కోట్ల పెట్టుబడితో 2 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.
Green Field Bio Ethanol Plant in Chodavaram: చోడవరంలో గ్రీన్ ఫీల్డ్ బయో ఇథనాల్ ప్లాంట్
పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు.. ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం
► 2 వేల మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు సంబంధించి ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం. రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో యాగంటి, కమలపాడులో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టుల వల్ల 2 వేల మందికి ఉద్యోగాల కల్పన.
► వీటితో పాటు ఎన్‌హెచ్‌పీసీతో మరో మూడు ప్రాజెక్టుల ఫీజిబిలిటీపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం. మరో 2,750 మెగావాట్లకు సంబంధించిన ఈ ప్రాజెక్టులపై కలసి పని చేసేలా అడుగులు.