RECAI: ఆర్‌ఈ రంగం పెట్టుబడుల్లో భారత్ స్థానం?
పునరుత్పాదక విద్యుత్ (ఆర్‌ఈ) రంగంలో పెట్టుబడులకు ఆకర్షణీయమైన దేశాల సూచీలో (రెన్యువబుల్ ఎనర్జీ కంట్రీ అట్రాక్టివ్‌నెస్ ఇండెక్స్ - ఆర్‌ఈసీఏఐ) తొలి 3 దేశాలు ఈసారి కూడా తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి. అమెరికా అగ్రస్థానంలో ఉండగా, చైనా రెండో స్థానంలోనూ, భారత్ యథాప్రకారం 3వ స్థానంలోనూ కొనసాగుతున్నాయి. ఆర్‌ఈసీఏఐకి సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ ఈవై అక్టోబర్ 13న విడుదల చేసిన 58వ ఎడిషన్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆర్‌ఈ విభాగంలో పెట్టుబడి అవకాశాలకు ఆకర్షణీయంగా ఉన్న టాప్ 40 దేశాలతో ఈవై ఈ జాబితా రూపొందించింది.
పీపీఏ సూచీలో 30 స్థానం...
పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లలో ఆకర్షణీయతకు కొలమానంగా కొత్తగా పీపీఏ సూచీని కూడా ప్రవేశపెట్టినట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై వివరించింది. దీనికి సంబంధించి టాప్ 30 పీపీఏ మార్కెట్లలో భారత్‌కు ఆరో ర్యాంక్ దక్కినట్లు పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పునరుత్పాదక విద్యుత్ (ఆర్‌ఈ) రంగంలో పెట్టుబడులకు ఆకర్షణీయమైన దేశాల సూచీలో (ఆర్‌ఈసీఏఐ) భారత్‌కు 3వ స్థానం
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : కన్సల్టెన్సీ సంస్థ ఈవై
ఎక్కడ : ఆర్‌ఈ విభాగంలో పెట్టుబడి అవకాశాలకు ఆకర్షణీయంగా ఉన్న టాప్ 40 దేశాల్లో...
చదవండి: జీ–20 శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహించిన దేశం?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్