Skip to main content

G20 Countries: జీ–20 శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహించిన దేశం?

Modi

అఫ్గానిస్తాన్‌లో మానవ హక్కులు, భద్రత, ప్రజల అగచాట్లు, ఉగ్రవాదంపై పోరాటం వంటి అంశాలపై చర్చించేందుకు గ్రూప్‌ ఆఫ్‌ 20(జీ–20) దేశాల అధినేతలు(G20 Extraordinary Leaders’ Summit on Afghanistan) అక్టోబర్‌ 12న వర్చువల్‌ విధానం ద్వారా సమావేశమయ్యారు. జీ–20 అధ్యక్ష హోదాలో ఇటలీ ప్రధాని మారియో ద్రాగి నేతృత్వంలో జరిగిన ఈ భేటీనుద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఏకీకృత ప్రతిస్పందన అవసరమని అంతర్జాతీయ సమాజానికి పిలుపు నిచ్చారు. ఆకలి, పోషకాహార సమస్యతో అల్లాడుతున్న అఫ్గాన్‌ పౌరులకు తక్షణమే బేషరతుగా మానవతా సాయం అందించాలని కోరారు. 20 ఏళ్లుగా అఫ్గాన్‌ సమాజం సాధించిన అభివృద్ధిని కొనసాగించేం దుకు తాలిబన్ల పాలనలో మహిళలు, మైనారిటీలకు  తగు చోటు కల్పించాలని అన్నారు.

జీ–20 సభ్యదేశాలు...

జీ–20(గ్రూప్‌ ఆఫ్‌ 20) అనేది ప్రపంచంలోని 20 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమి. ఇందులో 19 దేశాలు, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)కు సభ్యత్వం ఉంది. సభ్యదేశాలు ఇవే..

  1. అర్జెంటీనా
  2. ఆస్ట్రేలియా
  3. బ్రెజిల్‌
  4. కెనడా
  5. చైనా
  6. ఫ్రాన్స్‌
  7. జర్మనీ
  8. భారత్‌
  9. ఇండోనేషియా
  10. ఇటలీ
  11. జపాన్‌
  12. మెక్సికో
  13. రష్యా
  14. సౌదీ అరేబియా
  15. దక్షిణ కొరియా
  16. దక్షిణాఫ్రికా
  17. టర్కీ
  18. యునెటైడ్‌ కింగ్‌డమ్‌
  19. యునెటైడ్‌ స్టేట్స్‌
  20. యూరోపియన్‌ యూనియన్‌

చ‌ద‌వండి: ట్యునీసియా తొలి మహిళా ప్రధాని బాధ్యతలు చేపట్టిన నేత?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : గ్రూప్‌ ఆఫ్‌ 20(జీ–20) దేశాల అధినేతల వర్చువల్‌ సమావేశం (G20 Extraordinary Leaders’ Summit on Afghanistan)
ఎప్పుడు : అక్టోబర్‌ 12
ఎవరు : గ్రూప్‌ ఆఫ్‌ 20(జీ–20) దేశాల అధినేతలు 
ఎందుకు : అఫ్గానిస్తాన్‌లో మానవ హక్కులు, భద్రత, ప్రజల అగచాట్లు, ఉగ్రవాదంపై పోరాటం వంటి అంశాలపై చర్చించేందుకు...

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 13 Oct 2021 01:50PM

Photo Stories