Female Prime Minister: ట్యునీసియా తొలి మహిళా ప్రధాని బాధ్యతలు చేపట్టిన నేత?
ఆఫ్రికా దేశం ట్యునీసియా ప్రథమ మహిళా ప్రధానమంత్రిగా నజ్లా బౌడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. దేశ రాజధాని ట్యునిస్‌లో అక్టోబర్ 11న జరిగిన ఈ కార్యక్రమంలో బౌడెన్ మాట్లాడుతూ... అవినీతిపై పోరాటమే తమ లక్ష్యమని ప్రకటించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం 24 మంత్రులతో కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. వీరిలో ప్రధానితో కలిపి అత్యధిక సంఖ్యలో 10 మంది మహిళలే ఉండటం గమనార్హం. ట్యునీసియా అధ్యక్షుడు కైస్ సయీద్ దాదాపు రెండు నెలల క్రితం అప్పటి కేబినెట్‌ను బర్తరఫ్ చేసి, సర్వాధికారాలను చేజిక్కించుకున్నారు. అనంతరం సెప్టెంబర్ 29వ తేదీన ఆయన ప్రధాని పదవికి బౌడెన్ పేరును ప్రతిపాదించారు. దీంతో బౌడెన్ ప్రధాని పదవిని చేపట్టారు.
చదవండి: రాష్ట్ర హైకోర్టు సీజేగా నియమితులైన న్యాయమూర్తి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆఫ్రికా దేశం ట్యునీసియా ప్రథమ మహిళా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎవరు : నజ్లా బౌడెన్
ఎక్కడ : ట్యునిస్, ట్యునీసియా
ఎందుకు : ట్యునీసియా అధ్యక్షుడు కైస్ సయీద్ నిర్ణయం మేరకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్