Solar Dehydration Units in AP: ఏపీలో సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లు
కర్నూలు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన 100 యూనిట్లు విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారన్నారు.
దీంతో రూ. 84 కోట్ల అంచనాతో 5 వేల యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం సోమవారం విజయవాడలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. సొసైటీ సీఈవో శ్రీధర్‌రెడ్డి, బీవోబీ డీజీఎం చందన్ సాహూ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఒక్కో యూనిట్ అంచనా వ్యయం రూ.1.68 లక్షలని చెప్పారు. ప్రాజెక్టు వ్యయంలో ప్రభుత్వం 35 శాతం (రూ.29.40కోట్లు) సబ్సిడీగా భరిస్తుందని, లబ్ధిదారులు 10 శాతం (రూ.8.40 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందన్నారు.మిగిలిన 55 శాతం (రూ.46.20 కోట్లు) బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఆహార వ్యర్థాలను తగ్గించడం, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడం, గ్రామీణ మహిళా సాధికారత ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలన్నారు.
Millets Export: చిరుధాన్యాల ఎగుమతుల్లో ఏడో స్థానంలో ఏపీ
కర్నూలులో పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన యూనిట్ల ద్వారా ఒక్కో మహిళ సగటున రూ.12 వేల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని చెప్పారు. బి, సి గ్రేడ్ ఉల్లి, టమాటాలకు సైతం రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాయలసీమ జిల్లాల్లో 3,500 యూనిట్లు, మిగిలిన జిల్లాల్లో మరో 1,500 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
Green Field Bio Ethanol Plant in Chodavaram: చోడవరంలో గ్రీన్ ఫీల్డ్ బయో ఇథనాల్ ప్లాంట్