Dharani Portal : ‘ధరణి’ పోర్టల్ విశేషాలు.. అందుబాటులో ఉన్న సేవలు ఇవే..
ఆస్తి రిజిస్ట్రేషన్లను మొత్తం విధానాన్ని ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ పోర్టల్‌ను తెచ్చింది. ఆస్తి రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా.. ల్యాండ్ మ్యూటేషన్, ల్యాండ్ రికార్డుల సెర్చ్, ఇతర భూ సంబంధిత సేవలకు ధరణి పోర్టల్ ఒక గమ్యస్థానంగా ఉంది. డిజిటల్‌గా ల్యాండ్ రికార్డులను తీసుకురావడంతో పారదర్శకత పెరిగింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ ఆఫీసులలో మోసాలు తగ్గాయి.
☛ Rythu Bandhu scheme : ‘రైతు బంధు’ పథకం విశేషాలు.. అర్హతలు.. దరఖాస్తు విధానం ?
వ్యవసాయేతర భూములకు..
వ్యవసాయ, వ్యవసాయేతర ప్రాపర్టీలు రెండింటికీ ఈ ధరణి పోర్టల్ వర్క్ చేస్తుంది. ధరణి పోర్టల్ వచ్చిన తర్వత ల్యాండ్‌ల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ గంటల్లో జరిగిపోతున్నాయి. పాత ఓనర్ పాస్‌బుక్‌ను అప్ డేట్ చేసి, కొనుగోలుదారునికి కొత్త పాస్ బుక్ ఇస్తున్నారు. వ్యవసాయేతర భూములకు మెరూన్ రంగు పాస్ బుక్, వ్యవసాయ భూముకలు గ్రీన్ రంగు పాస్ బుక్‌లను జారీ చేస్తున్నారు. అంతకుముందు ల్యాండ్ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ కోసం వారాల తరబడి సమయం పట్టేది.
ధరణి పోర్టల్‌లో అందుబాటులో ఉన్న సేవలు ఇవే..
☛ తెలంగాణ ప్రజలకు స్లాట్ బుకింగ్
☛ ఎన్ఆర్ఐ పోర్టల్
☛ మ్యూటేషన్ సేవలు
☛ పాస్‌బుక్ లేకుండా నాలాకు దరఖాస్తు
☛ లీజుకు దరఖాస్తు
☛ అమ్మకం నమోదు
☛ విభజనకు దరఖాస్తు
☛ వారసత్వానికి దరఖాస్తు
☛ తనఖా నమోదు
☛ జీపీఏ నమోదు
☛ స్లాట్ రద్దు, రీషెడ్యూలింగ్
☛ భూ వివరాలు పరిశీలన
☛ నిషేధిత భూమి
☛ Dalita Bandhu scheme Details : ‘దళిత బంధు’ పథకం విశేషాలు.. అర్హతలు.. దరఖాస్తు విధానం ?
ధరణి యాప్ డౌన్ లోడ్ ప్రొసీజర్ ఇలా..
☛ మీ మొబైల్ ఫోన్‌లోని గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లాలి.
☛ సెర్చ్ బాక్స్‌లో ధరణి తెలంగాణ ల్యాండ్ రికార్డ్స్ అని నొక్కాలి
☛ జాబితా మీ స్క్రీన్‌లో కనిపిస్తుంది.
☛ పైన ఉన్న ధరణి తెలంగాణ ల్యాండ్ రికార్డ్స్ యాప్‌పై క్లిక్ చేయాలి
☛ ఆ తర్వాత మీ మొబైల్‌లో ధరణి తెలంగాణ యాప్ డౌన్ లోడ్ అవుతుంది.
ధరణి పోర్టల్ సైనప్ ఎలా అంటే..?
☛ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి
☛ హోమ్ పేజీపై సైనప్ లింక్ ఉంటుంది
☛ దానిపై క్లిక్ చేస్తే ఒక ఫామ్ వస్తుంది.
☛ దానిలో మీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, అడ్రస్ వివరాలు ఇవ్వాలి
☛ మీ మొబైల్‌కి వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి
☛ ఇలా మీరు ధరణి పోర్టల్‌లో రిజిస్టర్ అవ్వొచ్చు
☛ Kalyanamasthu : కళ్యాణమస్తు.., వైఎస్సార్ షాదీ తోఫా.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
ధరణి పోర్టల్ ద్వారా పలు ఫామ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫామ్‌లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సేల్స్ డీడ్, మోర్టగేజ్, గిఫ్ట్, లీజ్, రిలీజ్ డీడ్, డౌన్‌లోడ్ 32 ఏ ఫామ్ వంటివి అందుబాటులో ఉన్నాయి. వీటిపై మీకు కావాల్సిన దానిపై క్లిక్ చేసి, డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
వివిధ పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు పరీక్షల్లో ఈ ‘ధరణి’ పోర్టల్ సమగ్ర సమాచారం మీకు ఉపయోగపడే అవకాశం ఉంది.