Skip to main content

Dalita Bandhu scheme Details : ‘దళిత బంధు’ పథకం విశేషాలు.. అర్హ‌త‌లు.. ద‌ర‌ఖాస్తు విధానం ?

సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితుల ఉద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే దళిత బంధు. దళితుల్లో ఆర్థిక సాధికారత, స్వావలంబన సాధించేందుకు దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.
Dalit Bandhu
Dalit Bandhu Details

ఈ పథకం కింద ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయం ద్వారా దళితులు ఎంట్రప్రెన్యూర్లుగా మారనున్నారు.

దేశంలో ఉన్న ప్రస్తుత అన్ని స్కీమ్‌లలో కెల్లా అతిపెద్ద నగదు బదిలీ పథకం ఇదే కావడం విశేషం. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 16 ఆగస్టు 2021న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని శాలపల్లిలో దళిత బంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది దశల వారీగా అమలవనుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారమే దళిత బంధు పథకాన్ని రూ.1200 కోట్లతో అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆగస్టు 16, 2021 నుంచి ఈ స్కీమ్ ప్రారంభమైంది.షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ వంటి వెనుకబడిన వర్గాల ప్రజలకు ఊతంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకమిది.. దళిత బంధు స్కీమ్ కింద తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ఎస్‌సీలకు రూ.లక్ష కోట్ల వరకు వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

☛ Rythu Bandhu scheme : ‘రైతు బంధు’ పథకం విశేషాలు.. అర్హ‌త‌లు.. ద‌ర‌ఖాస్తు విధానం ?

దళిత బంధు స్కీమ్ అర్హతలు ఇవే..?

dalit bandhu eligibility

➤ ఈ స్కీమ్‌కి దరఖాస్తు చేసుకునే వ్యక్తి దళితుడై ఉండాలి.
➤ వాలిడ్ కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.
➤ తెలంగాణ వారై ఉండాలి.
➤ తెలంగాణ రేషన్ కార్డు దరఖాస్తుదారుని వద్ద ఉండాలి.
➤ ఆదార్ కార్డు తప్పనిసరి.

దళిత బంధు స్కీమ్ ప్రయోజనాలు ఇలా..
☛ అర్హులైన ఎస్‌సీలకు దళిత బంధు కింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది.
☛ ఇది పూర్తి ఉచితం.
☛ రూ.10 లక్షల ఆర్థిక సాయం.
☛ ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సినవసరం లేదు.
☛ ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా లబ్దిదారుని అకౌంట్లోకే మనీ క్రెడిట్ అవుతుంది.

దళిత బంధు పథకం పూర్తి వివరాలు ఇవే..

benefits of dalit bandhu

☛ రాష్ట్రంలోని 119 నియోజవర్గాలలో దళిత బంధు పథకం అమలు.
☛ రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలకు 1.70 లక్షల కోట్లు కేటాయింపు.
☛ ఈ పథకం పర్యవేక్షణకు సీఎం కార్యాలయంలో ఒక ప్రత్యేక కార్యదర్శి ఉంటారు.
☛ దళితులందరూ అర్హులే
☛ మూడేళ్లలో దళితులందరికీ లబ్ది చేకూరేలా నిర్ణయాలు
☛ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు కమిటీలు ఏర్పాటు
☛ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు సైతం దళిత బంధు
☛ దళిత బంధు అందుకునే వారికి, గతంలో అందుకున్న అన్ని ప్రభుత్వం సంక్షేమ పథకాలు వర్తింపు

దళిత బంధు నుంచి ఆర్థిక సాయం అందుకున్న వారు వారికి నచ్చిన వ్యాపారాన్ని పెట్టుకోవచ్చు. పవర్ ట్రిల్లర్ కొనుగోలు చేసుకోవచ్చు. వరి కోత కోసే, వరి వేసే మెషిన్లు కొనుక్కోవచ్చు. అలాగే ఆటో ట్రాలీలు, ట్రాక్టర్లు వంటి వాటిని కొనుక్కోవచ్చు. పాల పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, ఆయిల్ మిల్, గ్రైడింగ్ మిల్, స్టీల్, సిమెంట్, బ్రిక్ వ్యాపారాలు, ఫర్నీచర్ దుకాణాలు, క్లాత్ ఎంపోరియం, మొబైల్ దుకాణాలు, హోటళ్లు ఇలా ఏదైనా సొంతంగా వ్యాపారం పెట్టుకుని స్వావలంబన పొందవచ్చు.

ఈ ఆర్థిక సాయంతో పాటు, దళిత సెక్యూరిటీ ఫండ్‌ను కూడా ప్రభుత్వం దీని కింద ఏర్పాటు చేస్తోంది. ఈ ఫండ్‌కు జిల్లా కలెక్టర్ బాధ్యత వహిస్తారు. ఈ ఫండ్‌ లబ్దిదారులకు ఇచ్చే మొత్తం నుంచి కనీస మొత్తాన్ని జమ చేస్తారు. ఎలక్ట్రానిక్ చిప్‌తో కూడిన ఐడెంటీ కార్డును లబ్దిదారులకు జారీ చేస్తారు. దీంతో ఈ స్కీమ్‌ పురోగతిని ప్రభుత్వం మానిటర్ చేయడం కుదురుతుంది.

వివిధ పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల‌కు ప‌రీక్ష‌ల్లో ఈ ‘ దళిత బంధు’ పథకం స‌మాచారం మీకు ఉప‌యోగ‌ప‌డే అవ‌కాశం ఉంది.

Published date : 24 Jan 2023 05:36PM

Photo Stories