Skip to main content

World's Oldest Calendar : ప్ర‌పంచంలోనే అతి పురాత‌న‌మైన క్యాలెండర్‌.. ఇన్నేళ్ల నాటిదే..!

World's Oldest Calender is found in Turkey  Stone Pillar Details  Archaeological Excavation

ప్రపంచంలోనే అతి పురాతనమైన క్యాలెండర్‌ దక్షిణ టర్కీలో లభ్యమైంది. టర్కీలోని గోబెర్లి టేపే వద్ద పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్న సమయంలో ఒక భారీ రాతి స్తంభం బయటపడింది. దానిపై సూర్యచంద్రులకు సంబంధించిన గుర్తులు, మరికొన్ని ఇతర చిహ్నాలను గుర్తించారు. కాగా ఆ ఆలయం 13,000 ఏళ్ల నాటిదని, రాతి స్తంభంపై ఉన్న గుర్తులు అప్పటి సూర్యచంద్రుల కాలాలకు సంబంధించినవని పేర్కొన్నా­రు.

Research on Mars : అంగారక గ్రహం పరిశోధ‌న‌లో వెలుగులోకోచ్చిన‌ కీల‌క విష‌యం..

ఇటువంటి చిహ్నాలను సుమారు 10,850 బి.సి. లో చెక్కి ఉంటారని భావిస్తున్నారు. అప్పట్లో దీనిని ఓ క్యాలెండర్‌ గా ఉపయోగించి ఉండొచ్చన్నారు. ఈ స్తంభంపై 365 జు ఆకారపు చిహ్నాలు చెక్కి ఉన్నాయని, అందులోని ఒక్కో జు ఒక్కో రోజును సూచిస్తోందని పేర్కొన్నారు. ఇందులో 12 చంద్ర నెలలు అదనంగా 11రోజులు ఉన్నట్లు వివరించారు.

Published date : 20 Aug 2024 02:53PM

Photo Stories