Central Government: 28 రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల.. తెలుగు రాష్ట్రాలకు ఎన్ని రూ.కోట్లు అంటే..!
Sakshi Education
దేశవ్యాప్తంగా 28 రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన రూ.1,78,173 కోట్ల పన్నుల వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ మొత్తంలో 2024 అక్టోబర్‌లో చెల్లించాల్సిన సాధారణ వాయిదాకు అదనంగా ఒక ముందస్తు వాయిదా రూ.89,086.50 కోట్లు కూడా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ అక్టోబర్ 10వ తేదీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,211 కోట్లు, తెలంగాణకు రూ.3,745 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది.
ఈ పన్నుల వాటాలో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు రూ.31,962 కోట్లు ఉండగా, అత్యల్పంగా గోవాకు రూ.688 కోట్లు ఇచ్చింది. పండుగల సీజన్ దృష్ట్యా రాష్ట్రాల మూల ధన వ్యయాన్ని వేగవంతం చేయడం, అభివృద్ధి, సంక్షేమ తదితర వ్యయాలకు ఆర్థిక సహాయం చేయడానికి ముందస్తు వాయిదాలు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది.
Interest Rates: వరుసగా 10వ సారి.. రెపో రేటు యథాతథంగా కొనసాగింపు..!
Published date : 11 Oct 2024 01:08PM