OU: డాక్టరేట్ అందుకున్న గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్
Sakshi Education
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు తెలంగాణ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, మధిరకు చెందిన భీమనపల్లి కృష్ణకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ లభించింది.
డాక్టరేట్ అందుకున్న గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్
ప్రొఫెసర్ లక్ష్మి పర్యవేక్షణలో 'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం – తెలంగాణలో కూలీల ఆర్థిక విశ్లేషణ' అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి గాను ఆయనకు బుధవారం డాక్టరేట్ ప్రకటించారు. కూలీ కుటుంబంలో జన్మించిన కృష్ణ ఓయూలో పీజీ పూర్తిచేశాక, కొన్నాళ్లు లెక్చరర్‌గా పనిచేయడమే కాక ఉపాధి హామీ పథకంలో కూడా విధులు నిర్వర్తించారు.