Degree College: అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
తుక్కుగూడ: మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ బాలుర గురుకుల డిగ్రీ కళాశాల (మహేశ్వరం గేటు) బీబీఏ కోర్స్ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తునట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విరూపాక్షప్ప జూలై 28న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంబీఏలో 55 శాతం మార్కులు సాధించిన వారు అర్హులన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 31వ తేదీ వరకు తుక్కుగూడలోని ఎంజేపీ డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 94900 52739, 95028 42484 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
చదవండి:
Published date : 29 Jul 2023 03:36PM