Govt Junior Colleges: గెస్ట్ లెక్చరర్లను తొలగించడం సరికాదు
సుభాష్‌నగర్: జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లను తొలగించడం సరికాదని, వెంటనే వారిని వి ధుల్లోకి తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గౌతమ్‌కుమార్, జన్నారపు రాజేశ్వర్, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు వనమాల సత్యం డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం వారు కలెక్టరేట్ ఎ దుట నిరసన తెలియజేశారు. అనంతరం అదనపు కలెక్టర్ యాదిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1654 మంది గెస్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారని, వీరని త్రీమెన్ కమి టీ నియమించిందని తెలిపారు. ఇటీవలే ప్రభుత్వం జీవో 1145 విడుదల చేసి అందరినీ కొనసాగించాలని.. లేదా రెన్యూవల్ చేయాలని ఉత్తర్వులిచ్చింద ని పేర్కొన్నారు. అయినా విద్యాశాఖ కమిషనర్ ఏకపక్షంగా అందరినీ తొలగించారని, పీజీలో మెరిట్ ఆధారంగా తిరిగి గెస్ట్ లెక్చరర్ల నియామకాలు చేపడుతామని ప్రకటించారని తెలిపారు. సీఎం కేసీఆర్ స్పందించి అందరినీ కొనసాగించాలని కోరారు. నాయకులు మనోజ్, భాస్కర్, దేవిక ఉన్నారు.
Guest Lecturer Posts: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం