Students Education: గిరిబిడ్డలకు సేవాభారతి అండ..
సాక్షి ఎడ్యుకేషన్: మారుమూల గ్రామాల్లో పుట్టి చదువుకు, కనీస అవసరాలకు దూరంగా ఉంటున్న గిరిబిడ్డలకు సేవాభారతి అండగా నిలుస్తోందని సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సాయికిషోర్ అన్నారు. సేవాభారతి ఆధ్వర్యంలో విద్యార్థి వికాసయోజన కార్యక్రమంలో భాగంగా ఆదివారం చింతూరులో గిరిజన విద్యార్థులు, ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు.
Social Media Jobs 2023 : భారీ వేతనాలతో యూత్‌కు కొలువులు.. ఎలా అంటే..?
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులకు చేదోడు, వాదోడుగా, ఇంటిపనులకే పరిమితమైన గిరిబిడ్డలను మారుమూల గ్రామాల నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు వంటి నగరాలకు చేర్చి కళాశాలల్లో విద్యనభ్యసించేలా చేయూతనిచ్చామని తెలిపారు. వారంతా ప్రస్తుతం ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, నర్సులుగా, ఉపాధ్యాయులుగా పలు రంగాల్లో రాణిస్తున్నారని, అటు వృత్తి జీవితంలోనూ, ఇటు వ్యక్తిగత జీవితంలోనూ విజయవంతంగా సాగుతున్నారన్నారు. పోలవరం ముంపు మండలాలైన చింతూరు, వీఆర్ పురం, కూనవరం, వేలేరుపాడు మండలాలతో పాటు కుక్కనూరు, భద్రాచలం, ఎటపాక మండలాల్లోని సుమారు 200 మారుమూల గ్రామాలకు చెందిన ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించడంతోపాటు, వైద్య సౌకర్యాలు కల్పించినట్లు ఆయన తెలిపారు.
school teachers: క్రమశిక్షణ పేరుతో కఠిన దండన
అనంతరం ఏజన్సీలో సేవాభారతి కార్యక్రమాల అమలుకు కృషి చేస్తున్న డాక్టర్ గంగాధరప్రసాద్, ఆవుల సుబ్బారావును సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అఖిలభారత కార్యదర్శి డాక్టర్ మురళీకృష్ణ, ఆరోగ్యభారతి రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ రావు, గారపాటి నారాయణ, కట్టం ముత్తయ్య, లక్ష్మి పాల్గొన్నారు.