Awareness for Students : విద్యతోపాటు ఇతర విషయాల్లో కూడా విద్యార్థుల్లో అవాగహన పెంచాలి..
రేపల్లె రూరల్: విద్యతోపాటు వ్యవసాయంపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) డీపీవో వెంకటేశ్వర్లు సూచించారు. ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ (ఎస్‌ఎస్‌హెచ్‌పీ) కార్యక్రమంలో భాగంగా మండలంలోని వడ్డీవారిపాలెం జెడ్పీ హైస్కూలులో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు గురువారం వ్యవసాయ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భూసార పరిరక్షణ, మట్టి నమూనాల సేకరణ తదితర అంశాల్ని వివరించారు.
ITI Admissions: ప్రభుత్వ ఐటీఐలో అడ్మిషన్లు
ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ నేలను, అందులోని సారాన్ని పరిరక్షించకుంటే సాగు చేసే ఏ పంటలో అయినా అధిక దిగుబడులు, నాణ్యత లభిస్తాయన్నారు. రసాయన ఎరువుల వినియోగం ద్వారా కాకుండా సేంద్రియ పద్ధతుల్లో భూసారాన్ని పెంచుకుంటే ఆరోగ్యవంతమైన వాతావరణంతో పాటు కాలుష్యాన్ని నివారించవచ్చని సూచించారు. ఎప్పటికప్పుడు వ్యవసాయంలో మెలకువలను తెలుసుకుంటుండాలని చెప్పారు. ఈ రంగంలోనూ అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని గుర్తు చేశారు.
Best Teacher Awards: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు
ఈ సందర్భంగా విద్యార్థులకు నేల సంరక్షణ, భూసారాన్ని పెంపొందించుకునే విధానంతో పాటు మట్టి నమూనాల సేకరణ తదితర అంశాలపై ప్రయోగపూర్వకంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్‌ఎం బి.మాధవి, మండల వ్యవసాయ అధికారి ఆర్.విజయ్‌బాబు, గుంటూరు డీఆర్‌సీ ఏవో రాజవంశీ, వ్యవసాయ విస్తరణాధికారి ఎం.ప్రభాకరరావు, ఎంఎస్‌టీఎల్ ఏవో వెంకటేష్, గ్రామ వ్యవసాయ సహాయకురాలు సుమ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.