TS EAPCET 2024 Certificate Verification: రేపటి నుంచి ఎంసెట్ ధ్రువపత్రాల పరిశీలన.. పరిశీలనకు ఇవి తప్పనిసరి..
Sakshi Education
బిజినేపల్లి: ఎఫ్‌సెట్ కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ చేసుకున్న విద్యార్థులకు జూలై 6న నుంచి జూలై 8 వరకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ పరిశీలన పాలెం శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విద్యారాణి జూలై 4న ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియకు విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు అదనంగా తీసుకురావాలన్నారు. అలాగే ఎంసెట్ ర్యాంకు కార్డు, ఎంసెట్ హాల్ టికెట్, ఆధార్, ఇంటర్మీడియట్ లేదా సమానమైన విద్యార్హత కలిగిన సర్టిఫికెట్లు, టీసీ, ఆదాయ, కుల, ఈడబ్ల్యూఎస్, స్థానిక ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.
చదవండి:
>> College Predictor - 2024 (AP & TG EAPCET, POLYCET & ICET)
>> Top 20 Engineering (Branch wise) Colleges in Telangana - Click Here
Published date : 05 Jul 2024 06:03PM