Skip to main content

Tomorrow School Holiday 2024 : రేపు అన్ని స్కూల్స్ బంద్‌.. ఇప్ప‌టికే అన్ని స్కూల్స్ మెసేజ్‌లు..

సాక్షి ఎడ్యుకేష‌న్: రాష్ట్రవ్యాప్తంగా రేపు అన‌గా.. జూన్ 26వ తేదీ (బుధ‌వారం) స్కూల్స్‌కు సెల‌వులు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని స్కూల్స్‌కు ABVP బంద్‌కు పిలుపునిచ్చిన విష‌యం తెల్సిందే.
Parents Receiving Holiday Message  Telangana School Holiday Notice   Tomorrow Schools Holiday 2024 Due to Bandh  School Bandh Announcement

ముందు జాగ్ర‌త్త‌గా ప‌లు విద్యాసంస్థ‌లు ముందుగానే సెల‌వులు ఇచ్చేస్తున్నారు. రేపు స్కూల్‌కు సెల‌వు అంటూ విద్యార్థుల త‌ల్లిదండ్రుల ఫోన్ల‌కు మెసేజ్‌లు పంపుతున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని స్కూల్స్ రేపు సెల‌వు ఇచ్చారు.

కార‌ణం ఇదే..
ఇప్ప‌టికి స్కూల్స్ ప్రారంభమై 16 రోజులైనా పుస్తకాలు పంపిణీ చేయకపోవడం విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందని ABVP మండిపడింది. రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ABVP డిమాండ్ చేసింది. స్కూల్స్ స్వచ్ఛందంగా మూసివేసి సహకరించాలని ABVP కోరింది.

ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలలేమి వంటి అంశాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బందు కు పిలుపునిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.

☛ ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ  కొన్ని ప్రధాన డిమాండ్లను ఉంచారు.
ప్రైవేట్ కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో లక్షలలో వసూలు చేస్తున్న ఫీజు ను నియంత్రించాలి.
☛ పుస్తకాలు, యూనిఫామ్స్ ను ప్రైవేటు పాఠశాలలు అమ్ముతున్న నేపథ్యంలో వెంటనే నిరోధించాలి.
☛ ఫీజు నియంత్రణ చట్టాన్ని వెంటనే అమల్లోకి తేవాలి.
☛ ప్రభుత్వ గుర్తింపు పొందని, నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలకు గుర్తింపును వెంటనే రద్దుచేసి చర్యలు తీసుకోవాలి.
☛ డీఈవో, ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
☛ ప్రభుత్వ పాఠశాలల్లో వెంటనే ఉపాధ్యాయులను పూర్తి చేయాలి
☛ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం లో జరుగుతున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలి.
☛ మెగా డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న 24 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
☛ ప్రభుత్వ పాఠశాలలో వెంటనే అటెండర్ మరియు స్కావెంజర్ పోస్టులను భర్తీ చేయాలి.
☛ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 20% పేద విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించాలి.

కొత్త విద్యాసంవత్సరానికి(2024-25) సంబంధించిన..

ఈ సారి పాఠశాలల్లో రోజూ 90 శాతానికిపైగా విద్యార్థుల హాజరు ఉండాలని విద్యాశాఖను ఆదేశించింది. విద్యాహక్కు చట్టం-2009 ప్ర‌కారం తరగతులు, సబ్జెక్టుల వారీగా పిల్లలు నేర్చుకోవాల్సిన అంశాలను నిర్దేశించినందున లక్ష్య సాధనకు పిల్లలు క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాలని పేర్కొంది. ప్రభుత్వం కొత్త విద్యాసంవత్సరానికి(2024-25) సంబంధించిన అకడమిక్‌ క్యాలెండరును విడుదల చేసి.. మార్గదర్శకాలు వెలువరించింది. వాటిని అమలు చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అధికారులను ఆదేశించారు. 6,7 తరగతుల గణితం సబ్జెక్టును ఇక నుంచి భౌతికశాస్త్రం ఉపాధ్యాయులే బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రెండు తరగతులకు గణితం టీచర్లు బోధిస్తే వారిపై పనిభారం పెరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ ఇలా అన్ని రకాల పాఠశాలల్లో రోజూ 90 శాతానికిపైగా విద్యార్థులు హాజరవ్వాలని, అందుకు వారి తల్లిదండ్రులు, విద్యా కమిటీలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రధానోపాధ్యాయులను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

ప్రతి నెలా 4వ శనివారం..
ఈ సారీ ప్రతి నెలా 4వ శనివారం నో బ్యాగ్‌ డేను అమలుచేయాలి. రోజూ 30 నిమిషాల పాటు పాఠ్యపుస్తకాలు, కథల పుస్తకాలు, దినపత్రికలు, మేగజైన్లు చదివించాలి. టీవీ పాఠాలను యథావిధిగా ప్రసారం చేయాలి. విద్యార్థులతో 5 నిమిషాలు యోగా, ధ్యానం చేయించాలి. జనవరి 10 నాటికి పదో తరగతి సిలబస్‌ పూర్తి చేయాలి.

స్కూల్స్‌కు 2024-25లో సెల‌వుల ఇవే..
2025లో స్కూల్స్‌కు ఏప్రిల్‌ 24 నుంచి 2025 జూన్‌ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. ఈ ఏడాది దసరాకు అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు అంటే 13 రోజులపాటు పండుగ సెలవులు ఉంటాయి. డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు. 2025 జనవరిలో సంక్రాంతి సెలవులు జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం ఆరు రోజులు ఉంటాయని విద్యా శాఖ వెల్లడించింది. 

ఈ ఏడాది ప‌రీక్ష‌ల వివ‌రాలు..
మరోవైపు.. 2025 జనవరి పదో తేదీ వరకు పదో తరగతి సిలబస్‌ను పూర్తి చేయనున్నారు. తర్వాత రివిజన్‌ క్లాసులు ఉంటాయి. ఫిబ్రవరి 28, 2025 వరకు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి సిలబస్ పూర్తి చేస్తారు. ప్రతీ రోజూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఐదు నిమిషాల పాటు యోగా, మెడిటేషన్ క్లాసులు ఉండనున్నాయి. పదో తరగతి బోర్డు పరీక్షలను 2025 మార్చి నెలలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్‌లో పేర్కొంది.

Published date : 26 Jun 2024 08:32AM

Photo Stories