Education Sector Issues : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కారానికి పోరాటాలు ఒకటే మార్గం
కోవెలకుంట్ల: ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కలిసికట్టుగా ఉద్యమించి ప్రాథమిక పాఠశాలలను కాపాడుకుందామని యూటీఎఫ్(ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్‌కుమార్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహా సభ నిర్వహించారు. ఆ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు పీవీ ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 12వేల పైచిలుకు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండటం ఆవేదన కల్గించే విషయమన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.
AAPAR Card Problems : అపార్ కార్డుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు అనేక ఇబ్బందులు
ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని, విద్యా రంగానికి సంబంధించిన వివిధ యాప్‌ల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, 117 జీఓ రద్దు చేయాలన్నారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కారానికి పోరాటాలు ఒకటే మార్గమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు ఎంవీ సుబ్బారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్యంశెట్టి, నాయకులు సుధాకర్, ఐజయ్య, నాగస్వామి, సుజాత, సత్యప్రకాశం, శాంతిప్రియ తదితరులు పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)