AAPAR Card Problems : అపార్ కార్డుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు అనేక ఇబ్బందులు
పార్వతీపురంటౌన్: అపార్ ఐడీతో విద్యార్థులు తీరని కష్టాలు ఎదుర్కొంటున్నారని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రవి కుమార్ అన్నారు. ఈ మేరకు ఆదివారం పార్వతీపురంలోని ఏఐఎస్‌ఎఫ్ కార్యాలయంలో ఏఐఎస్‌ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం వన్ నేషన్ వన్ స్టూడెంట్ నినాదంతో దేశవ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రేషన్ (అపార్) పేరిట జారీ చేస్తున్న కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలతో పాటు పార్వతీపురం జిల్లాలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
Air Pollution: పిల్లలపై తీవ్ర ప్రభావం చూపనున్న వాతావరణ కాలుష్యం!
వాటి పరిష్కారానికి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే ఉన్న ఆధార్ కార్డులో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పేర్లలో తప్పులు, స్కూల్ రికార్డుల్లో జన్మదిన తేదీల మార్పు, చిన్నపాటి అక్షర దోషాలు, గ్రామ, నగరపంచాయతీ పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలో నమోదై ఉన్న జనన ధ్రువీకరణ పత్రాల్లో విద్యార్థుల ఇంటిపేర్లు, పూర్తిపేర్లు నమోదు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.
Junior College Lecturers : జూనియర్ కళాశాలలో టీచర్ల విధులను రెగ్యులర్ చెయ్యాలి
చిన్నచిన్న అక్షర తప్పులు తదితర సమస్యలు సరిచేసేందుకు విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు ఆధార్ నమోదు కేంద్రాలు లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. బర్త్ సర్టిఫికెట్ కావాలంటే వీఆర్‌ఓలు వేలాది రూపాయలు విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర వసూలు చేస్తున్నారని, దీనిపై తక్షణమే కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)