Engineering Counselling 2024: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పెరిగినా..కంప్యూటర్ సైన్స్ కే డిమాండ్
హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి సీట్లు భారీగా పెరిగాయి. ఇప్పటివరకూ రెండు దశల కౌన్సెలింగ్ చేపట్టారు. వీటిల్లో 59,917 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. గత ఏడాది 57,152 సీట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో పోలిస్తే ఈ సంవత్సరం 2,765 సీట్లు పెరిగాయి. ఐఐటీల్లో స్వల్పంగా సీట్లు పెరిగితే, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ప్రభుత్వ నిధులతో నడిచే జాతీయ కాలేజీల్లో కొత్త కోర్సులను చేర్చారు. వీటిల్లోనూ ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ కోర్సులే ఉన్నాయి.
మరికొన్ని కోర్సులకు అనుమతి రావాల్సి ఉంది. కొన్ని జాతీయ కాలేజీల్లో కొత్త కోర్సులతో ప్రత్యేక సెక్షన్లు ఏర్పాటు చేసే వీలుంది. దీంతో ఆఖరి దశ కౌన్సెలింగ్ నాటికి మరికొన్ని సీట్లు అందుబాటులోకి వచ్చే వీలుంది. దీనిపై త్వరగా నిర్ణయం వెల్లడించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకవైపు సీట్లు పెరిగినా... ప్రధాన కాలేజీల్లో డిమాండ్ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోసం అన్ని ప్రాంతాల్లోనూ విద్యార్థులు పోటీ పడుతున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సంపాదించిన వారి మధ్య కూడా ఈసారి పోటీ కన్పిస్తోంది.
జాతీయ స్థాయిలో డిమాండ్
జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్‌ఈ)కు భారీగా డిమాండ్ కని్పస్తోంది. జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌లో ఇది స్పష్టంగా కన్పిస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ఎక్కువ మంది సీఎస్‌ఈకే దరఖాస్తు చేశారు. గత ఏడాది కన్నా కటాఫ్ పెరిగినప్పటికీ టాప్ కాలేజీల్లో పోటీ మాత్రం ఈసారి కాస్త ఎక్కువగానే కని్పస్తోంది. వాస్తవానికి దేశంలోని 23 ఐఐటీల్లో గత ఏడాది 17,385 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, ఈ సంవత్సరం 17,740 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
జాతీయ కాలేజీల్లోనూ ఈసారి కొన్ని కొత్త కోర్సులను ప్రవేశ పెడుతున్నారు. వీటిల్లో కొన్నింటికి అనుమతులు రాగా.. మరికొన్నింటికి రావాల్సి ఉంది. ఆఖరి దశ కౌన్సెలింగ్ వరకూ ఎన్‌ఐటీల్లో సీట్లు పెరిగే వీలుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం 121 విద్యాసంస్థల్లో ఈ ఏడాది 59,917 సీట్లు భర్తీ చేయబోతున్నారు. ఇప్పటికే రెండు దశల కౌన్సెలింగ్ పూర్తికాగా, మరో మూడు దశలు ఉంది.
టాప్ కాలేజీల్లోనూ...
దేశంలోని ప్రధాన ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో కంప్యూటర్ సైన్స్‌కు పోటీ ఎక్కువగా ఉంది. అయితే, దూర ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో పెద్దగా పోటీ కన్పించలేదు. ఈ ప్రాంతాల్లో లక్షల్లో ర్యాంకులు వచి్చన వాళ్లకూ సీట్లు దక్కుతున్నాయి. తిరుపతి ఐఐటీలో సీట్లు ఈసారి 244 నుంచి 254కు పెరిగాయి. అయితే, సీఎస్‌ఈ ఓపెన్ కేటగిరీలో బాలురకు 4,522, బాలికలకు 6,324
ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. ఈసారి ఇక్కడ నాలుగేళ్ల ఇంజనీరింగ్ ఫిజిక్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చారు. అయినప్పటికీ సీఎస్‌ఈ వైపే పోటీ కని్పంచింది. వరంగల్ ఎన్‌ఐటీలో కూడా సీట్లు 989 నుంచి 1049కు పెరిగాయి. ఇక్కడ 60 సీట్లతో ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సును ప్రవేశ పెట్టారు.
అయితే, సీఎస్‌ఈకి ఇక్కడ బాలురకు ఓపెన్ కేటగిరీలో 201, బాలికలకు 3,527 ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. ఐఐటీ గాం«దీనగర్‌లో 288 నుంచి 370కు గత ఏడాదే పెంచారు. ఈసారి కొత్తగా 30 సీట్లు అదనంగా ఇచ్చారు. ఇక్కడ కూడా 90 శాతం మంది సీఎస్‌ఈకే దరఖాస్తు చేశారు. ఐఐటీ బాంబే 1,358 నుంచి 1,368కి, ధార్వాడ్‌లో 310 నుంచి 385కు, భిలాయ్‌లో 243 నుంచి 283కు, భువనేశ్వర్‌లో 476 నుంచి 496కు, ఖరగ్‌పూర్‌లో 1,869 నుంచి 1,889కి, జోథ్‌పూర్‌లో 550 నుంచి 600కు, పట్నాలో 733 నుంచి 817కు, గువాహటిలో 952 నుంచి 962కు సీట్లు పెరిగాయి. ఈ పెరిగిన సీట్లతో పోలిస్తే సీఎస్‌సీ కోసం పోటీ పడిన విద్యార్థుల సంఖ్య రెట్టింపు కన్పిస్తోంది.
Tags
- Engineering seats
- Computer Science
- Indian Institute of Technology
- National Institute of Technology
- Engineering College seats increased
- Education News
- Sakshi Education Latest News
- HyderabadEngineering
- NationalEngineeringColleges
- EngineeringSeats
- JosaCounseling
- EngineeringAdmissions
- SeatAllocation
- CSEDemand
- SakshiEducationUpdates