Schools for Tribals: గిరిజన విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభం
సాక్షి ఎడ్యుకేషన్: ఆ గిరిజన గ్రామాలకు తొలిసారిగా అక్షరోదయం కలిగింది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వ పాఠశాల లేకపోవడంతో గిరిజనులంతా చదువుకు దూరమయ్యారు. ఈ గ్రామాలకు చెందిన వారు కొండ కింద ఉన్న శరభవరం గ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి చదువుకోవడం కష్టం కావడంతో కొంతమంది దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునేవారు. ఈ నేపథ్యంలో ఎన్.ఆర్.ఎస్.టి.సి. కింద పాఠశాల మంజూరైంది.
Study Abroad: భారతీయ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 30 వేల మందికి ఫ్రాన్స్ సాదర ఆహ్వానం..!
గిరిజన పంచాయతీ అర్ల శివారు పీత్రుగెడ్డలో సోమవారం ఆ పాఠశాలను ఎంఈవో– 1, 2 జానుప్రసాద్, జగ్గారావు, స్థానిక సర్పంచ్ వండల వనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈవోలు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో లోసింగి, చినగెడ్డ, పెదగెడ్డ తదితర ఆరు గ్రామాల్లో 32 మంది బడిఈడు పిల్లలను గుర్తించి, ఇక్కడ పాఠశాల ఏర్పాటుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదించామన్నారు. ఉపాధ్యాయ వలంటీర్ పోస్టుకు అయిదుగురు అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో అర్హత కలిగిన భణికెల సురేష్‌ను నియమించామన్నారు.
Teacher's Day Special: ఇంగ్లిష్‌లో మా‘స్టార్లు’ వీరే..
తమ పర్యవేక్షణలో ఇక్కడ చిన్నారుల విద్యాభ్యాసం మెరుగుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇక్కడ పాఠశాల మంజూరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎంపీపీ యర్రంశెట్టి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ పోతల లక్ష్మీరమణమ్మ తెలిపారు.