Skip to main content

Quiz Competitions: విద్యార్థులకు సైన్స్‌ క్విజ్‌ పోటీలు.. విజేతలకు బహుమతులు

బెల్లంకొండ: ప్రభుత్వ పాఠశాలల్లో 8,9,10 తరగతులు చదువుతున్న విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి ప్రోత్సహించేందుకు భారతీయ విజ్ఞానమండలి (బీవీఎం), ఆంధ్రప్రదేశ్‌ సైన్స్‌ సిటీ, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో కౌశల్‌– 2024 పోటీలు నిర్వహణకు సన్నద్ధమవుతున్నారు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించేందుకు కౌశల్‌ సైన్స్‌ క్విజ్‌ పోటీలతోపాటు పోస్టర్‌ పోటీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
Quiz Competitions.  Students quiz competitions in bellamkonda
Quiz Competitions

మూడు దశల్లో నిర్వహించే ఈ పోటీలకు నవంబర్‌ 15వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.బీబీఎంఏపీ.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంది. విద్యార్థులకు పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో పోటీలు నిర్వహించనున్నారు. పాఠశాల, జిల్లా స్థాయి పోటీలు ఆన్‌లైన్‌లో, రాష్ట్రస్థాయి పోటీలు ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారు.

KGBV Teacher Posts Counselling: రేపు కేజీబీవీ టీచింగ్‌ పోస్టులకు కౌన్సెలింగ్‌

రిజిస్ట్రేషన్‌కు నవంబర్‌ 15 ఆఖరి తేదీ. పాఠశాల స్థాయి పరీక్షలు నవంబర్‌ 20,21,22 తేదీలలో ఉంటాయి. పాఠశాల స్థాయిలో జరిగిన పరీక్షలో మొదటి 20 స్థానాలు గెలుపొందినవారు జిల్లా స్థాయికి అర్హులు. జిల్లా స్థాయి పరీక్షలు డిసెంబర్‌ 6న, రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్‌ 29, 30 తేదీలలో విజయవాడలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ కళాశాలలో నిర్వహిస్తారు.

Indian Student Offers Free Work: ‘వారంలో ఏడు రోజులు ఫ్రీగా పని చేస్తాను’.. యూకేలో యువతి ఆవేదన

పోటీల్లో భాగంగా కౌశల్‌ సైన్స్‌ క్విజ్‌ పోటీలు, పోస్టర్‌ కాంపిటీషన్‌, వైజ్ఞానిక లఘు చిత్ర పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం, జ్ఞాపికలు అందజేయనున్నారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)


 

Published date : 07 Nov 2024 06:06PM

Photo Stories