Skip to main content

Study Abroad: భార‌తీయ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌.. 30 వేల మందికి ఫ్రాన్స్ సాద‌ర‌ ఆహ్వానం..!

విదేశీ విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ శుభవార్త చెప్పింది. 2030 నాటికి భారత్ నుంచి 30,000 మంది విద్యార్థులను ఆహ్వానించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకుంది.
2030,Study Abroad, global education, study in france ,Educational opportunities,
భార‌తీయ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌.. 30 వేల మందికి ఫ్రాన్స్ సాద‌ర‌ ఆహ్వానం..!

ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ పారిస్‌ను సందర్శించిన దాదాపు నెల రోజుల తర్వాత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ ప్రకటన చేశారు. ఎక్కువ మంది భారతీయ విద్యార్థులను ఆకర్షించడానికి ఐదేళ్ల షార్ట్-స్టే స్కెంజెన్ వీసాతో సహా అనేక చర్యలను ఫ్రాన్స్‌ రూపొందించింది.

ఇవీ చ‌ద‌వండి: విదేశాల్లో చ‌దువుకునేందుకు ఇంత ట్యాక్స్ చెల్లించాలా.. .!

Study abroad

ప్ర‌ధాన మంత్రి మోదీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఇరు దేశాల మ‌ధ్య వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య ఒప్పందాల్లో భాగంగానే ఫ్రాన్స్‌ ఈ చర్యలు తీసుకుంది. విద్యార్థుల ప్రయోజనం కోసం ఫ్రెంచ్ భాషతో సహా ఇతర విద్యా విభాగాలలో సమగ్ర శిక్షణ ఇవ్వడానికి ఫ్రాన్స్ సిద్ధపడిందని రాయభార కార్యాలయం తెలిపింది. విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రెసిడెంట్ మాక్రాన్, ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు.

ఇవీ చ‌ద‌వండి: ఇలా చేస్తే ఈజీగా అమెరికాకి వెళ్లొచ్చు... కొత్త నిబంధ‌న‌లు తెలుసా?

Study abroad

ఇవీ చ‌ద‌వండి: లక్షల‌ మంది భారతీయ పిల్లలు తల్లిదండ్రులకు దూరం.. ఎందుకంటే!

సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని, ప్రపంచ స్థాయి విద్యా అవకాశాలను భారతీయులతో పంచుకోవడానికి ఆసక్తిని ఫ్రాన్స్ కలిగి ఉంది. భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ మంచి స్నేహితునిలా పనిచేస్తుంది.'అని ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ తెలిపారు. ఫ్రాన్స్ విద్యావకాశాలు విద్యార్థులకు పరిచయం చేసేలా చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, ముంబైలలో ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను కూడా నిర్వహించనుంది. అక్టోబర్‌లో జరగనున్న ఈ వేడుకకు దాదాపు 40 ఇన్‌స్టిట్యూషన్‌లకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు.

Published date : 06 Sep 2023 09:11AM

Photo Stories