Education News: విదేశాల్లో చదువుకునేందుకు ఇంత ట్యాక్స్ చెల్లించాలా.. తల్లిదండ్రులకు ఇది శరాఘాతమే.!
యూనియన్ బడ్జెట్-2023 లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ ఏడాది జులై నుంచి విదేశాల్లో చదువుకు, ఇతర ఖర్చుల కోసం పంపించే డబ్బుపై ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్(టీసీఎస్)ను వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. సరళీకృత చెల్లింపుల పథకం (Liberalised Remittance Scheme – LRS) కింద వసూలు చేసే విదేశీ ప్రయాణాలు,పెట్టుబడులు, నగదు ట్రాన్స్‌ఫర్‌పై ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.
చదవండి: ఇలా చేస్తే ఈజీగా అమెరికాకి వెళ్లొచ్చు... కొత్త నిబంధనలు తెలుసా?
కొన్ని మినహాయింపులు...
ఎల్ఆర్ఎస్ లో ఎడ్యుకేషన్, మెడికల్ విభాగాలకు మినహాయింపు ఉంటుంది. అయితే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. కేవలం విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చుకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. విద్యార్థి రోజువారీ ఖర్చుల కోసం ఇక్కడి నుంచి పంపే డబ్బులు కాలేజీ ఫీజు సంబంధిత ఖర్చుల కిందకు రావు.
ఎడ్యుకేషన్ లోన్ ద్వారా చెల్లిస్తే...
ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్ కింద ఎడ్యూకేషన్ లోన్ తీసుకొని విదేశాల్లో చదువు నిమిత్తం పంపే డబ్బు రూ.7లక్షలు దాటితే 0.5 శాతం ట్యాక్స్ కట్టాలి. అయితే, ఎడ్యుకేషన్ లోన్ కాకుండా ఇతర లోన్లు తీసుకొని విదేశాలకు రూ.7లక్షలకు మించి పంపితే 5 శాతం ట్యాక్స్ పడుతుంది.
చదవండి: ఇలా చేస్తే జాబ్‌లేకపోయినా ఎంచక్కా ఇంగ్లాండ్‌లో స్థిరపడొచ్చు
ఇతర ఖర్చులపై 20 శాతం ట్యాక్స్
విదేశాలకు చెందిన కాలేజీ క్యాంపస్‌లోని హాస్టల్స్‌లో ఉండి చదువుకునే పిల్లలకు హాస్టల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు చెల్లించేందుకు డబ్బులు పంపుతున్నట్లు తల్లిదండ్రులు ఆధారాలు చూపించాలి. అలా కాకుండా రోజువారీ ఖర్చులకు పంపితే మాత్రం 20 శాతం టీసీఎస్ పే చేయాల్సి ఉంటుంది.
బ్యాంక్‌లో ఏ-2 ఫామ్ తప్పని సరి
ఎల్ఆర్ఎస్ విధానంలో భాగంగా విదేశాల్లో ఉన్న పిల్లలకు డబ్బులు ఎందుకు పంపిస్తున్నామో తెలుపుతూ బ్యాంకులో ఏ-2 ఫామ్ నింపాలి. అందులో ఏ అవసరాలకు చెల్లిస్తున్నారో తెలుపుతూ డిక్లరేషన్ ఫామ్‌పై సంతకం చేయాలి. అక్కడ మీరు మీ పిల్లల విద్యావసరాలకు కాకుండా ఇతర అవసరాల కోసం డబ్బులు పంపుతున్నారని తేలితే 20 శాతం టీసీఎస్ వసూలు చేస్తారు.