UK: ఇలా చేస్తే జాబ్‌లేకపోయినా ఎంచక్కా ఇంగ్లాండ్‌లో స్థిరపడొచ్చు... అయితే ఈ వయసు వారు మాత్రమే...
అయితే విదేశాల్లో ఉద్యోగం అంటే మామూలు విషయం కాదు. ఇక ఉద్యోగం లేనివారు ఫారిన్ ఆశలను వదులుకోవాల్సిందే. అయితే యూకే ప్రభుత్వ నిర్ణయంతో భారత కుర్రాళ్లు ఎగిరిగంతేస్తున్నారు.
18 నుంచి 30ఏళ్ల మధ్య....
యూకేలో స్థిరపడాలనుకునే భారతీయులకు ఇంగ్లండ్ శుభవార్త అందించింది. ఇకపై బ్రిటన్‌లో నివసించేందుకు స్పాన్సర్, జాబ్స్‌తో సంబంధం లేకుండా ఉండేలా అక్కడి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. యూకే యంగ్ ప్రొఫెషన్ స్కీమ్ పేరుతో తెచ్చిన ఈ కొత్త పథకంలో 18ఏళ్ల నుంచి 30ఏళ్ల మధ్య వయసు వారు రెండేళ్ల పాటు ఎలాంటి జాబ్స్, స్పాన్సర్స్ లేకపోయినా నివసించ వచ్చు.
ఇవీ చదవండి: OUలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలు షురూ
ఫిబ్రవరి 28 నుంచి మార్చి2 లోపు...
యూకే- ఇండియా యంగ్ ప్రొఫెషన్ స్కీంలో ప్రతి సంవత్సరం యూకేకి చెందిన 3వేల ప్రాంతాల్లో భారతీయులు ఉండేందుకు అర్హులు. యూకే ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగా భారతీయులకు యూకేకు వెళ్లేందుకు అప్లికేషన్‌లను ఫిబ్రవరి 28 నుంచి మార్చి2 లోపు సబ్మిట్ చేయాలని భారత్‌లోని యూకే రాయిబారి కార్యాలయం ట్వీట్ చేసింది. మార్చి 2లోపు అభ్యర్ధులు సబ్మిట్ చేసిన అప్లికేషన్‌ల నుంచి లక్కీ డ్రా తీస్తారు. డ్రాలో పేరు వచ్చిన అర్హులైన అభ్యర్ధులు వీసాకు అప్లయి చేసుకోవచ్చు.
అర్హతలు, దరఖాస్తు చేసే విధానం
- రాయబారి కార్యాలయం పేర్కొన్నట్లు దరఖాస్తు చేయాలి
- పూర్తి చేసిన దరఖాస్తును నిర్ణీత గడువులో సబ్మిట్ చేయాలి.
- దరఖాస్తు తేదీకి 6 నెలల కంటే ముందు జారీ చేసిన స్థానిక పోలీసు సర్టిఫికేట్ లేదా పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్‌ను అందజేయాలి.
- బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యా అర్హతను కలిగి ఉండాలి.
- విద్యా అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్లను జతచేయాలి
- దరఖాస్తుదారుడు.. అర్హత కలిగి ఉన్నారనేలా కాలేజీ నుంచి లేదా యూనివర్సిటీ నుంచి రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలి.
ఇవీ చదవండి: ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్... 6.24 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు