Skip to main content

Tata Steel Jobs: ఫ్రెషర్స్‌కు గుడ్‌ న్యూస్‌... ఏడాదికి 6.24 లక్షల ప్యాకేజీతో టాటాస్టీల్‌లో ఉద్యోగాలు

ఆర్థిక మాంద్యం పేరు చెప్పి కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఇష్టానుసారం తొలగించేస్తున్నాయి. ఎన్నో ఏళ్లపాటు ఉద్యోగ అనుభవం ఉన్నా ఉపయోగం లేకుండా పోతోంది.
TATA Steel Jobs

ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో తెలియక ఐటీ ఉద్యోగులు కంటిమీదకునుకు లేకుండా బతుకుతున్నారు. ఈ సమయంలో ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న వారికే ఉద్యోగాలు దొరకడం కష్టమవుతోంటే... ఇక ఫ్రెషర్స్‌ కష్టాలు చెప్పనవసరం లేదు.

కానీ, టాటా స్టీల్‌ ఫ్రెషర్స్‌కు భారీగా ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. టాటా స్టీల్‌ అస్పైరింగ్‌ ఇంజినీర్స్‌ ప్రోగ్రామ్‌–2023 ద్వారా ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మార్చి 3వ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 

బీటెక్‌/డిగ్రీ పూర్తి చేసిన వారు, లేదా చివరి ఏడాది పరీక్షలు రాసే వారు అప్లై చేసుకోవచ్చు. జనరల్‌ అభ్యర్థులు 65 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇంజనీరింగ్‌ ట్రెయినీగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్‌ హోదాలో ఉద్యోగం కల్పిస్తారు.

అర్హత: బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 01.02.2023 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 32 ఏళ్లు వరకు సడలింపు ఉంది.
జీతం: శిక్షణ సమయంలో స్టైపెండ్‌ నెలకు రూ.30,000 చెల్లిస్తారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఏటా రూ.6.24 లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: టెక్నికల్‌ టెస్ట్‌లో మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 03, 2023. మ‌రిన్ని వివ‌రాల‌కు https://tslhr.tatasteel.co.in/recruit/AppAdv.aspx క్లిక్ చేయండి.

Published date : 15 Feb 2023 03:53PM

Photo Stories