OUలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలు షురూ
Sakshi Education

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలు ప్రారంభమైన్నట్లు డైరెక్టర్ ప్రొ.అప్పారావు తెలిపారు. ఓయూ క్యాంపస్ కాలేజీలతో పాటు అనుబంధ కళాశాలల్లో 2022– 23 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లోమా, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ కోర్సులో జూన్, జులై నెలల్లో ప్రవేశాలు కలి్పంచామన్నారు. ఈ విద్యా సంవత్సరానికి ఆగస్టు వరకు విదేశీ విద్యార్థులకు ప్రవేశాలు కలి్పంచనున్నట్లు వివరించారు. ప్రస్తుతం 87 దేశాల వారు చదువుతున్నారని చెప్పారు. కరోనాతో రెండేళ్లుగా వీరి సంఖ్య తగ్గిందని, ప్రస్తుతం పెరగనుందన్నారు.
Also read: Higher Educationలో సమూల మార్పులు... యూకే వర్సిటీల సహకారంతో రూపకల్పన
Published date : 19 May 2022 06:52PM