Smart Teaching: స్మార్ట్ బోధనపై అవగాహన అవసరం
సత్యవేడు: ఉపాధ్యాయులకు స్మార్ట్ బోధనపై అవగాహన అవసరమని డీఈఓ వి.శేఖర్ తెలిపారు. బుధవారం సత్యవేడు బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ టీచర్లు, పీఈటీలకు నిర్వహిస్తున్న పునశ్చరణ తరగతులను పరిశీలించారు. డీఈఓ మాట్లాడుతూ ఐఎఫ్‌పీ (ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్) డిజిటల్ బోర్డులను విద్యార్థులు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మెలకువలను పాటిస్తూ పిల్లలకు అర్థమయ్యేలా పాఠ్యాంశాలను బోధించాలని స్పష్టం చేశారు. అనంతరం డిజిటల్‌బోర్డులో ఇంగ్లీషు– తెలుగు, నిఘంటువును ఓపెన్ చేసుకొనే విధానంపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. విద్యార్ధులకు యోగాపై ఆసక్తిని పెంపొందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు పీఈటీలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓలు రవి, ఉషా, ప్రధానోపాధ్యాయని భారతి, ఉపాధ్యాయులు, రిసోర్సుపర్సన్లు భాస్కర్, ఆనంద్, శ్రీదేవి, మురళి, బాబు, కుమార్ పాల్గొన్నారు.