Skip to main content

National Inspire Manak Competitions: జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌ మనక్‌ పోటీల్లో జిల్లా విద్యార్థి సత్తా

National Inspire Manak Competition Winner, Competition in Delhi, 8th to 11th of This Month, Mallela Nikhilchand, ZP High School Student, National Inspire Manak Competitions,Four Ways Hacksaw Machine Project
National Inspire Manak Competitions

ఒంగోలుజాతీయస్థాయి ఇన్‌స్పైర్‌ మనక్‌ పోటీల్లో పుల్లలచెరువు మండలం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి మల్లెల నిఖిల్‌చంద్‌ సత్తాచాటారు. ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు ఢిల్లీలో జరిగిన ఈ పోటీల్లో ఫ్యాబ్రికేషన్‌ ఆఫ్‌ ఫోర్‌ వేస్‌ హ్యాక్‌సా మెషీన్‌ ప్రాజెక్టును ప్రదర్శించారు. జాతీయస్థాయిలో మొత్తం 60 ప్రాజెక్టులను ఉత్తమ ప్రాజెక్టులుగా ఎంపిక చేశారు.

రాష్ట్రం తరఫున 35 మంది ప్రాజెక్టులు ప్రదర్శించగా, వాటిలో నాలుగు ఉత్తమ ప్రాజెక్టులుగా ఎంపికయ్యాయి. వాటిలో మన జిల్లాకు చెందిన నిఖిల్‌చంద్‌ ప్రదర్శన ఒకటి. కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి జితేంద్రసింగ్‌ చేతుల మీదుగా మంగళవారం నిఖిల్‌చంద్‌ అవార్డు అందుకున్నారు. అతనితో పాటు గైడ్‌ ఉపాధ్యాయుడు మస్తాన్‌వలిని డీఈవో వీఎస్‌ సుబ్బారావు, మార్కాపురం, ఒంగోలు ఉప విద్యా శాఖ అధికారులు చంద్రమౌళీఽశ్వర్‌, అనితరోజ్‌రాణి అభినందించారు.

Published date : 13 Oct 2023 09:42AM

Photo Stories