Green Card backlog: లక్షల మంది భారతీయ పిల్లలు తల్లిదండ్రులకు దూరం.. ఎందుకంటే!
ఆరి హెచ్4 కేటగిరీ వీసాల ప్రాసెసింగ్‌కు దశాబ్దాలకు పైగా వెయిటింగ్ జాబితా ఉండటమే ఇందుకు కారణం. వీరి సంఖ్య లక్షకు పైగా ఉంటుందన్న అంచనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్ కార్డుల కోసం ఉద్యోగాధారిత కేటగిరీ కింద దరఖాస్తు చేసుకుని వెయిటింగ్ లో ఉన్న భారతీయుల సంఖ్య 10.7 లక్షలకు పైగా ఉంది. ఇది చాలదన్నట్టు ఒక్కో దేశం నుంచి ఏటా ప్రాసెస్ చేసే వీసా దరఖాస్తుల సంఖ్యను 7 శాతానికి పరిమితం చేయడం సమస్యను జటిలం చేసింది.
చదవండి: పదో తరగతి అర్హతతో ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... ఇలా అప్లై చేసుకోండి.!
చదవండి: మీ పిల్లల ఉన్నత విద్యకోసం ఈ ఇంటర్నేషనల్ ఫండ్స్ గురించి తెలుసుకోండి..!
ప్రస్తుత వేగంతో మన వాళ్లందరికీ గ్రీన్ కార్డులు రావాలంటే హీన పక్షం 135 ఏళ్లు పడుతుంది. 21 ఏళ్ల కంటే తక్కువ వయసు వారు అమెరికాలో ఉండేందుకు వీలు కల్పించేదే హెచ్4 వీసా. ఈ కారణంగా కనీసం 1.34 లక్షల మంది భారతీయ పిల్లలు 21 ఏళ్లు నిండగానే అమెరికా వీడాల్సి ఉంటుందని డిసైడ్ మెయిర్ అనే ఇమిగ్రేషన్ వ్యవహారాల నిపుణుడు చేసిన అధ్యయనంలో తేలింది. హెచ్ 1బీ కేటగిరీ కింద అమెరికాలో ఉండే విదేశీయుల పిల్లలకు హెచ్4 వీసా ఇస్తారు.