Skip to main content

‘ట్రిపుల్‌’ ట్రబుల్స్‌ ఎవరికీ పట్టవా?

భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిందే... కానీ ఇక్కడ చదివే విద్యార్థుల సమస్యలు మాత్రం ఎవరికీ తెలియవు.
Does anyone have triple troubles

ఏం జరిగినా గుట్టుగా ఉంచడం రహస్య క్యాంపస్‌గా మార్చడమే ఉన్నతాధికారుల లక్ష్యంగా కనిపిస్తోంది. చదువుకునే పిల్లలకు జైలు వాతావరణం తలపించే పరిస్థితులు కనిపిస్తున్నా ఏ ఒక్కరూ నోరు మెదపడం లేదు. తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఓ కమిటీ వేసుకుందామన్నా అనుమతించడం లేదు. కమిటీ కోసం దరఖాస్తు చేసుకుంటే ఏదో ఒక వంక చూపి విద్యార్థులను ఇబ్బందులు పెట్టడమే కాకుండా వారికి కమిటీ వేసుకునే పరిస్థితులను మరింత క్లిష్టం చేస్తున్నారు.

విద్యార్థుల ఆందోళనలు, నిరసనలు ఇలా ఎదో ఒక విషయంలో ట్రిపుల్‌ఐటీ ఎప్పుడూ వార్తల్లో కనిపిస్తున్నా శాశ్వత పరిష్కారం మాత్రం ఎవరూ చూపడం లేదు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డారు. బాసర ట్రిపుల్‌ఐటీ రహస్య క్యాంపస్‌గా మారింది. అక్కడ ఏంజరిగినా బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. మీడియా, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, మేధావులు ఎవరైనా సరే లోపలికి మాత్రం అనుమతించరు.

చదవండి: ఇంజనీరింగ్‌ - జాబ్ గైడెన్స్ | ప్రాజెక్ట్ గైడెన్స్ | సక్సెస్ స్పీక్స్ | గెస్ట్ స్పీక్స్ | న్యూస్

ఆందోళనకు సిద్ధమవుతున్న విద్యార్థులు..

మరోవైపు తమ సమస్యల పరిష్కారం కోసం ఇ క్కడ చదివే విద్యార్థులంతా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రెండేళ్ల క్రితం చేపట్టిన ఉద్యమంలాగే ఇ ప్పుడు కూడా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించా రు. గతంలో కొంతమంది విద్యార్థులే టార్గెట్‌గా చేసి కేసులు పెట్టారు. ఇప్పుడు విద్యార్థులంతా ఐ క్యంగా వెళ్లి తమ సమస్యలు వినిపించి కమిటీ వేసి పోరాడాలని ఆలోచిస్తున్నారు. క్యాంపస్‌ అధికారులు కమిటీకి అనుమతించాలని కోరుతున్నారు.

నిబంధనల పేరిట కాలయాపన చేస్తే విద్యార్థులంతా ఐక్యంగా నిరసనలకు దిగాలని నిర్ణయించారు. తమ సమస్యలను వినకుంటే నిరవధిక ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. ఏళ్ల తరబడి సమస్యలతో సహవాసం చేస్తున్న తమ ఇబ్బందులు తీర్చే మార్గం చూపాలని కోరుతున్నారు. ముదోల్‌ ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌ జనవరిలో అసెంబ్లీలోనూ ట్రిపుల్‌ ఐటీ ప్రక్షాళన చేపట్టాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికై నా దృష్టి పెట్టి ట్రిపుల్‌ ఐటీ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.

భరోసా లేక...

తమ బిడ్డల భవిష్యత్‌కు భరోసాగా ఉంటుందనుకు నే ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్‌ఐటీలో ఇటీవలి కా లంలో వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్ప డుతున్నారు. తాజాగా మరో విద్యార్థి తన నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. వేలాది మంది ఉండే ఈ క్యాంపస్‌లో చదివే విద్యార్థులకు మనోధైర్యం ఇచ్చే వాళ్ళు లేకపోవడమే ఇందుకు కారణంగా భా విస్తున్నారు. రోజూ చదివే విద్యార్థులపై యూనివర్సిటీ అధికారులు దృష్టి పెట్టలేకపోతున్నారు. 9వేల మంది విద్యార్థులు ఉండే ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో తరగతి గదుల్లో నీరసంగా, అసహనంగా, ఒంటరి గా ఉండే వారిని పిలిచి కౌన్సిలింగ్‌ ఇచ్చి మనోధైర్యాన్ని కల్పిస్తే ఆత్మహత్యలు కాస్తయినా ఆగుతాయి. విద్యార్థులు ఒత్తిడిలో చదువుతారు.

చదువు పూర్తవుతున్న సమయంలోనూ ప్లేస్‌మెంట్‌, కుటుంబ పరిస్థితులు ఇతర వ్యసనాలు వారిలో పదేపదే మానసిక ఒత్తిడిని పెంచుతుంటాయి. ఈ ఒత్తిడిని తగ్గించేలా క్యాంపస్‌లో క్రీడలు, సంగీతంపై మక్కువపెంచేలా చూడాలి. వారానికి ఒక్కరోజైనా విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య అన్నింటినీ మరిచి మానసిక ప్రశాంతతను పొందేలా వారిని ప్రేరేపించాలి.

ఇష్టమైన రంగంలో ఆటలు ఆడుకునేవీలు కల్పించాలి. ఎంతోమంది విద్యార్థులు ఉన్న ఈ క్యాంపస్‌లో అప్పుడప్పుడు వినోదాన్ని పంచే కార్యక్రమాలు నిర్వహించాలి. విద్యార్థులంతా ఒంటరిగా ఉండకుండా ఎవరితోనైనా తమ బాధలు చెప్పుకునేలా మనసువిప్పి మాట్లాడుకునేలా పరిస్థితులు కల్పించాలి. భయం మధ్య, ఏంజరుగుతుందోనన్న క్షణాల మధ్య తరగతి గదుల్లో, వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

సీఎం సార్‌ వస్తేనే...

నాటి ప్రభుత్వంలో బాసర ట్రిపుల్‌ఐటీలో ఆంక్షలపేరుతో ఎవరినీ అనుమతించలేదు. గతేడాది డిసెంబర్‌ 7న తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మార్చా రు. ప్రగతిభవన్‌ ఎదుట ఉన్న ఇనుప కంచెను తొలగించారు. అక్కడే ప్రజాదర్బార్‌ కా ర్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

కానీ బాసర ట్రిపుల్‌ఐటీలో మాత్రం నేటికీ పాత ఆంక్షలే కొనసాగిస్తున్నారు. క్యాంపస్‌ చుట్టూ ఉన్న భారీ ప్రహరీ దాటి లోనికి ఎవరూ వెళ్లలేరు. పైగా తల్లిదండ్రుల ను కూడా అనుమతించడం లేదు. ఇంటి నుంచి వండుకొచ్చిన భోజనాలు విద్యార్థులకు పెడదామన్నా పంపించడం లేదు. క్యాంపస్‌కు ఇరువైపులా భా రీ గేట్లు నిర్మించి ఎవరినీ అనుమతించడం లేదు.

విద్యార్థులకు సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా కల్పించడంలేదు. సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా బాసర ట్రిపుల్‌ఐటీకి వచ్చి సమస్యలు తెలుసుకుని శాశ్వత పరి ష్కారానికి మార్గం చూపుతారని ఇక్కడి విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

విద్యార్థులు ప్రతీరోజు ఆటలు ఆడుకునేలా షెడ్యూల్‌ ఉంచాలి. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు స్నానాలు, భోజనాలు, తరగతి గదులు వీటితోనే రోజు పూర్తవుతుంది. రోజుకు అరగంటైనా విద్యార్థులంతా ఇష్టమైన క్రీడల్లో పాల్గొనేలా ఏ ఒక్కరూ చూడడంలేదు.

క్రీడల్లో ఉన్న విద్యార్థులు మానసిక ఒత్తిడికి కాస్త దూరమవుతారు. వారంలో ఒక్కరోజైనా చెవులకు ఇంపైన సంగీతం, వినోద కార్యక్రమాలు తిలకించే ఏర్పాట్లు చేయాలి. కానీ అవేం ఇక్కడ జరగడంలేదు. విద్యార్థుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సైకాలజిస్టులతో కౌన్సిలింగ్‌లు ఇప్పిస్తూ మానసికస్థితిని తెలుసుకోవాలి.

ఒంటరిగా ఉండే విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులను పిలిచి గతంలో ఎలా ఉండేవారు? ఇప్పుడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు అనే విషయాలు చర్చించాలి. క్యాంపస్‌ అధికారులు మార్చలేకపోయిన ఒంటరితనాన్ని గుర్తించి కుటుంబ సభ్యులైనా వారికి మనోధైర్యం కల్పించి ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల పరిస్థితులు తెలుసుకుని వారి మనసుకు అనుగుణంగా నడుచుకుని ఆత్మహత్యలకు అడ్డుకట్టవేయాలని పోషకులు కోరుతున్నారు.

Published date : 01 Jul 2024 02:53PM

Photo Stories