Gurukul Admission Counselling : గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ ముగిసింది..
Sakshi Education

అనంతపురం: ఉమ్మడి జిల్లాలోని మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లకు రెండు రోజుల పాటు నిర్వహించిన కౌన్సెలింగ్ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. నార్పల బీసీ గురుకుల పాఠశాలలో తొలిరోజు బాలురకు, రెండోరోజు బాలికలకు మెరిట్ జాబితా మేరకు కౌన్సెలింగ్ చేపట్టారు. ఆయా తరగతుల్లో మొత్తం 63 సీట్లకు గాను 1:2 నిష్పత్తిలో 126 మందిని కౌన్సెలింగ్‌కు పిలిచారు. మెరిట్ ప్రకారం సీట్లు కేటాయించారు. బీసీ గురుకుల పాఠశాలల జోనల్–4 ఆఫీసర్ రాజేంద్ర కుమార్ రెడ్డి, మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల కన్వీనర్ సంగీత కుమారి ఆధ్వర్యంలో ఈ కౌన్సెలింగ్ జరిగింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని బీసీ గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
Midday Meal Scheme : అస్తవ్యస్తంగా మారిన మధ్యాహ్న భోజన పథకం..!
Published date : 04 Jul 2024 12:44PM