Skip to main content

June 26th Schools Holidays : ఎల్లుండి.. జూన్‌ 26వ తేదీన అన్ని స్కూల్స్ బంద్‌.. కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జూన్ 26వ తేదీన అన‌గా బుధ‌వారం అన్ని పాఠ‌శాల‌కు బంద్‌కు ABVP పిలుపునిచ్చింది.
Telangana students without books after 15 days of school reopening  June 26th Schools Holidays Due bandh  ABVP calls for a bandh in Telangana schools on June 26.

తెలంగాణ‌లో అన్ని స్కూల్స్ ప్రారంభ‌మై దాదాపు 15 రోజులైనా ఇంకా క‌నీసం పుస్త‌కాలు కూడా పంపిణీ చేయ‌లేదు. దీంతో అన్ని స్కూల్స్‌ల విద్యార్థులు చాలా స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. స్కూల్స్ విద్యార్థుల ప‌ట్ల ప్ర‌భుత్వ వ్య‌వ‌హ‌రిస్తున్న నిర్ల‌క్ష్యాన్ని తెలియ‌జేస్తోంద‌ని  ABVP మండిప‌డింది.

☛ July 27, 28th Holidays : జూలై 27వ తేదీన‌ సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. కార‌ణం ఇదే..

అలాగే చాలా ప్రైవేట్ స్కూల్స్ ఒక్క ప‌ద్ద‌తి లేకుండా భారీగా ఫీజులు పెంచాయి. దీనిపై కూడా రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఫీజు నియంత్ర‌ణ చ‌ట్టం అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేసింది. అలాగే స్కూల్స్‌లో మౌలిల వ‌స‌తులు క‌ల్పించాలి డిమాండ్ చేసింది. తెలంగాణ‌లోని ప్ర‌తి స్కూల్ స్వ‌చ్ఛందంగా మూసివేసి..అంద‌రు స‌హ‌క‌రించాలి ABVP కోరింది.

 School Holidays Extended Till 2024 June 30 : విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. స్కూల్స్‌కు జూన్ 30వ తేదీ వ‌ర‌కు సెల‌వులు.. ఎందుకంటే..?

 

2024లో Schools & Colleges సెల‌వులు వివ‌రాలు ఇవే...

☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

ఈ సారి పాఠశాలల్లో రోజూ 90 శాతానికిపైగా విద్యార్థుల హాజరు ఉండాలని విద్యాశాఖను ఆదేశించింది. విద్యాహక్కు చట్టం-2009 ప్ర‌కారం తరగతులు, సబ్జెక్టుల వారీగా పిల్లలు నేర్చుకోవాల్సిన అంశాలను నిర్దేశించినందున లక్ష్య సాధనకు పిల్లలు క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాలని పేర్కొంది. ప్రభుత్వం కొత్త విద్యాసంవత్సరానికి(2024-25) సంబంధించిన అకడమిక్‌ క్యాలెండరును విడుదల చేసి.. మార్గదర్శకాలు వెలువరించింది. వాటిని అమలు చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అధికారులను ఆదేశించారు. 6,7 తరగతుల గణితం సబ్జెక్టును ఇక నుంచి భౌతికశాస్త్రం ఉపాధ్యాయులే బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రెండు తరగతులకు గణితం టీచర్లు బోధిస్తే వారిపై పనిభారం పెరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ ఇలా అన్ని రకాల పాఠశాలల్లో రోజూ 90 శాతానికిపైగా విద్యార్థులు హాజరవ్వాలని, అందుకు వారి తల్లిదండ్రులు, విద్యా కమిటీలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రధానోపాధ్యాయులను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

నో బ్యాగ్ డే..
ఈ సారీ ప్రతి నెలా 4వ శనివారం నో బ్యాగ్‌ డేను అమలుచేయాలి. రోజూ 30 నిమిషాల పాటు పాఠ్యపుస్తకాలు, కథల పుస్తకాలు, దినపత్రికలు, మేగజైన్లు చదివించాలి. టీవీ పాఠాలను యథావిధిగా ప్రసారం చేయాలి. విద్యార్థులతో 5 నిమిషాలు యోగా, ధ్యానం చేయించాలి. జనవరి 10 నాటికి పదో తరగతి సిలబస్‌ పూర్తి చేయాలి.

స్కూల్స్‌కు 2024-25లో సెల‌వుల ఇలా..
2025లో స్కూల్స్‌కు ఏప్రిల్‌ 24 నుంచి 2025 జూన్‌ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. ఈ ఏడాది దసరాకు అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు అంటే 13 రోజులపాటు పండుగ సెలవులు ఉంటాయి. డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు. 2025 జనవరిలో సంక్రాంతి సెలవులు జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం ఆరు రోజులు ఉంటాయని విద్యా శాఖ వెల్లడించింది. 

ఈ ఏడాది ప‌రీక్ష‌ల వివ‌రాలు ఇవే..
మరోవైపు.. 2025 జనవరి పదో తేదీ వరకు పదో తరగతి సిలబస్‌ను పూర్తి చేయనున్నారు. తర్వాత రివిజన్‌ క్లాసులు ఉంటాయి. ఫిబ్రవరి 28, 2025 వరకు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి సిలబస్ పూర్తి చేస్తారు. ప్రతీ రోజూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఐదు నిమిషాల పాటు యోగా, మెడిటేషన్ క్లాసులు ఉండనున్నాయి. పదో తరగతి బోర్డు పరీక్షలను 2025 మార్చి నెలలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్‌లో పేర్కొంది.

Published date : 25 Jun 2024 08:55AM

Photo Stories