Skip to main content

School and Colleges Closed Due to Heavy Rain 2024 : రేపు స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు..? మ‌రో 2 రోజులు కూడా..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ శాఖ వెల్లడించింది.
School and Colleges Closed Due to Heavy Rain 2024

తీవ్ర వాయుగుండం తమిళనాడు తీరం వైపు కదులుతూ బలపడుతోంద‌ని, ట్రికోమలీకి ఆగ్నేయంగా 310 కి.మీ, నాగ పట్టణానికి దక్షిణ ఆగ్నేయంగా 590 కి.మీ, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 710 కి.మీ, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 800 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరికొద్ది గంటల్లో చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశముంది. తమిళనాడుకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 

☛➤ YS Jagan Mohan Reddy : ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు ఇంకెప్పుడు ఇస్తారు..? వీరి జీవితాలతో చెలగాటమా..? ఫీజు కట్టలేక ఓ విద్యార్థి కూలీ పనులకు..

27, 28 తేదీల్లో కూడా స్కూల్స్‌, కాలేజీల‌కు..నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ జారీ అయ్యింది. ఇప్ప‌టికే త‌మిళ‌నాడులోని Nagapattinam, Mayiladuthurai and Tiruvarur జిల్లాలోని స్కూల్స్‌, కాలేజీల‌కు న‌వంబ‌ర్ 26వ తేదీన(మంగ‌ళ‌వారం) సెల‌వుల‌ను ప్ర‌క‌టించారు. ఇలాగే ఈ వ‌ర్షాలు కొన‌సాగితే.. 27, 28 తేదీల్లో కూడా స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది.

ఆరు రోజుల పాటు... 

holidays news telugu


దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు.. రానున్న ఆరు రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంద్ర జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. రానున్న 24 గంటలలో నెల్లూరు, తిరుపతిలలో భారీ వర్షాలు.. అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేప‌థ్యంలో ఏపీలోని వివిధ జిల్లాల కలెక్టర్లు స్కూల్స్‌, కాలేజీల‌కు వ‌ర్ష తీవ్ర‌త‌ను బ‌ట్టి సెల‌వు ఇచ్చే అవ‌కాశం ఉంది. అలాగే ఈ వర్షాలు ఇలాగే కొన‌సాగితే.. ఆయా జిల్లాల కలెక్టర్లు ఒక‌టి నుంచి రెండు రోజులు సెల‌వులు ఇచ్చే అవకాశం ఉంది.

☛➤ AP DSC Notification 2024 Problems : డీఎస్సీ నోటిఫికేషన్ ఇంకెప్పుడు...? సీఎం తొలి సంత‌కంకు విలువ లేదా..?

న‌వంబ‌ర్‌ 30వ తేదీ నుంచి..
న‌వంబ‌ర్‌ 30వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాముందని.. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు వేగంతో గాలులు విస్తాయని.. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లరాదన్న వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

☛➤ AP Contract Employees Remove From Jobs : ఏపీలో భారీగా కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు.. కార‌ణం ఇదే..!

☛➤ AP Jobs Calendar 2024 : జాబ్‌ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై కీల‌క నిర్ణ‌యం..! తేల్చి చెప్పిన ప్ర‌భుత్వం...

➤☛ AP Grama Ward Volunteers : గ్రామ‌/వార్డు వలంటీర్లను తక్షణమే విధుల్లోకి.. నెల‌కు రూ.10 వేలు... ?

Published date : 26 Nov 2024 04:36PM

Tags

Photo Stories