Education News: విద్యను అందించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ
సాక్షి ఎడ్యుకేషన్: విద్యా ప్రమాణాల స్థాయి పెంపొందించేందుకు ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఎస్సీఈఆర్టీ ప్రణాళికలు రూపొందించింది. గుణాత్మక విద్య అందించడమే లక్ష్యంగా ‘ఉన్నతి’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. గత నెల 29 నుంచి మూడు విడతల్లో శిక్షణ అందించేలా కార్యాచరణ చేశారు. ఈనెల 1న మొదటి విడత శిక్షణ ముగిసింది. ఒక్కో విడతలో మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జంగేడు, గణపురం, చెల్పూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు..
Teachers day: విజ్ఞాన ఘనులు... ఈ గురువులు...!
మూడు విడతల్లో
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 567 ఉన్నత పాఠశాలల్లో 6-9 తరగతుల విద్యార్థులకు పాఠ్యాంశ బోధన చేస్తున్న 12,710 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఈ మేరకు గత నెల 29 నుంచే ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ ప్రారంభించిన విషయం తెలిసిందే.. మొదటి విడత గత ఆగస్టు 29 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు, రెండో విడత సెప్టెంబరు 2 నుంచి 6వ తేదీ వరకు, మూడో విడత సెప్టెంబరు 11 నుంచి 13 వరకు, ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉన్న కొన్ని జిల్లాల్లో నాలుగో విడత కూడా ఈ నెల 14 నుంచి 16 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉపాధ్యాయుల సంఖ్య అధారంగానే మూడు విడతల్లో, ఒక్కో విడతలో మూడు రోజుల పాటు తెలుగు, ఆంగ్లం, హిందీ, గణితం, జీవ, భౌతిక, సాంఘిక శాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయులకు శిక్షణ ఆయా జిల్లాల్లో గుర్తించిన కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ కల్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు విడతల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు.
Teacher's Day Celebrations: పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
సబ్జెక్టుల వారీగా
జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పలు గ్రామాల్లో గణపురం, చెల్పూరు, జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా శిక్షణ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నాం. తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, సాంఘికశాస్త్రం సబ్జెక్టులకు వేర్వేరుగా, భౌతిక, జీవశాస్త్రం, సబ్జెక్టులకు కలిపి శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఉపాధ్యాయులకు సరైన శిక్షణ ఇవ్వడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.
రాంకుమార్, జిల్లా విద్యాశాఖాధికారి. భూపాలపల్లి