Teacher's Day Celebrations: పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
Sakshi Education
నిన్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అనేక వేడుకలు జరిపారు. పలు ఉపాధ్యాయులను ఎంపిక చేసి పురస్కారాలతో సత్కరించారు. అలాగే ఓ పాఠశాలలో డీఆర్ఎం, డీపీఓ ల ఆధ్వేర్యంలో ఈ రకంగా వేడుకలు జరిపారు. అందులో వారు మాట్లాడుతూ...
celebrations in presence of DRM, DPO in school
సాక్షి ఎడ్యుకేషన్: గురువులు సమాజ నిర్దేశకులని డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) మనీష్ అగర్వాల్ అన్నారు. మంగళవారం స్థానిక రైల్వే ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా డీఆర్‌ఎంతో పాటు సీనియర్ డీపీఓ జయశంకర్ చౌహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
డీఆర్ఎం మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని, వారితోనే సమాజాభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన వివిధ నమూనాలను డీఆర్‌ఎం తిలకించారు. పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
IAS Sanjitha Mohapatra Success Story: వరుస వైఫల్యలను, ప్రతికూల పరిస్థితులను దాటుకుంటూ......పోరాటం చేసి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారిలా.. సక్సెస్ జర్నీ మీకోసం..