Admissions in IMU: ఐఎంయూలో ప్రవేశాలు.. ప్రోగ్రామ్‌లో చేరిన వారికి ఫెలోషిప్..
చెన్నె(తమిళనాడు)లోని ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ (ఐఎంయూ) పలు ప్రోగ్రాముల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రోగ్రాములు: ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ, ఎంఎస్(రీసెర్చ్) పార్ట్ టైం, ఫుల్‌టైం.
రీసెర్చ్ విభాగాలు: మెరైన్ ఇంజనీరింగ్, నాటికల్ సైన్స్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్,డ్రెడ్జింగ్ అండ్ హార్బర్ ఇంజనీరింగ్, ఆఫ్‌షోర్ సపోర్ట్ సర్వీసెస్, ఇన్‌లాండ్ వాటర్‌నెస్, కోస్టల్ షిప్పింగ్, రివర్ సీ షిప్పింగ్, పోర్ట్ అండ్ షిప్పింగ్ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చెయిన్ మేనేజ్‌మెంట్, మారిటైమ్ సెక్యూరిటీ అండ్ పైరసీ,మారిటైమ్ లా,మారిటైమ్ ఇన్సూరెన్స్, ఇంటర్ డిసిప్లినరీ ఏరియాస్.
అర్హతలు: కనీసం 55శాతం మార్కులతో సంబంధిత స్పెషలైజేషనల్‌లో పీజీ/ఎంఎస్ రీసెర్చ్ లేదా ఎంఫిల్ పూర్తిచేసినవారు లేదా మాస్టర్స్ ఉత్తీర్ణులైన మెరైనర్స్, ఎంఈ సర్టిఫికెట్ ఉన్నవారు, పీజీడీఎంఓ ఏం పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి ఐఎంయూలు,అనుబంధ సంస్థలు,డీజీ(ఎస్) గుర్తింపు పొందిన సంస్థల్లో కనీసం రెండేళ్ల బోధన అనుభవం తప్పనిసరి.
ఫెలోషిప్: ఫుల్‌టైమ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో చేరిన వారికి మాత్రమే ఫెలోషిప్ లభిస్తుంది.
ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ: ఇది పార్ట్ టైమ్ విధానంలో అందిస్తారు. ఈ ప్రోగ్రామ్‌ను 58 ఏళ్ల కాలవ్యవధిలో పూర్తిచేయాల్సి ఉంటుంది.
అర్హత: కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
ఎంఎస్(రీసెర్చ్): ఇది కూడా పార్ట్‌టైమ్ ప్రోగ్రామే. దీని కాలవ్యవధి 34 ఏళ్లు ఉంటుంది.
ఫుల్ టైం ప్రోగ్రామ్ 23 ఏళ్ల కాలవ్యవధితో ఉంటుంది.
అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో కనీసం 55శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
పరీక్ష కేంద్రాలు: దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఐఎంయూ క్యాంపస్‌లైన విశాఖపట్నం,కోల్‌కతా, కొచ్చి,చెన్నై,నవీ ముంబై వంటి కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తారు.
ముఖ్యమైన సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ముగిసింది.
- రాత పరీక్ష తేది: జనవరి 28, 2022
- ప్రోగ్రామ్ ప్రారంభం: మార్చి 01, 2022
- వెబ్‌సైట్: https://www.imu.edu.in/
చదవండి: IIFT: ఐఐఎఫ్‌టీలో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేదీ..