Skip to main content

Bad news for Indians in America: అమెరికాలోని భారతీయులకు బ్యాడ్‌న్యూస్‌

Bad news for Indians in America
Bad news for Indians in America

అమెరికాలో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులకు మరో చేదు  వార్త. చట్టబద్ధమైన వలసదారుల పిల్లలు, దాదాపు  2.50 లక్షలమంది అమెరికాను వీడే పరిస్థితి కనిపిస్తోంది.'డాక్యుమెంటెడ్ డ్రీమర్స్' గా పిలిచే ఈ పిల్లలు తాత్కాలిక ఉద్యోగ వీసాలపై వారి తల్లిదండ్రులతో అమెరికా వచ్చారు.  

Indian Air Force Admissions: ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు


కానీ ఇప్పుడు 21 ఏళ్లు నిండిన (ఏజింగ్‌ ఔట్‌) కారణంగా ఆ పిల్లలు  తమ డిపెండెంట్ స్థితిని కోల్పోయే ప్రమాదం ఉందన్న అంచనాలు ఆందోళన రేపుతున్నాయి.

శాసన ప్రతిష్టంభనకు రిపబ్లికన్లను వైట్ హౌస్  ఆరోపించింది.  డాక్యుమెంటెడ్‌ డ్రీమర్స్‌కు సహాయం చేసేందుకు  తాము ఒక ప్రక్రియను ప్రతిపాదించామని దాన్ని రిపబ్లికన్లు రెండుసార్లు తిరస్కరించాని అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ చెప్పారు.

చట్టసభ సభ్యులు, న్యాయవాదులు అమెరికాలో పెరిగిన పిల్లలను రక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు. 

హెచ్‌ 1బీ కేటగిరీ కింద అమెరికాలో ఉండే విదేశీయుల పిల్లలకు హెచ్‌4 వీసా ఇస్తారు. ఇది పిల్లలకు 21 ఏళ్లు వచ్చేంతవరకు చెల్లుతుంది. భారతీయ పిల్లలు కనీసం 2.50 లక్షల మంది  21 ఏళ్లు నిండగానే అమెరికా వీడాల్సి ఉంటుంది.

వారక్కడే ఉండాలంటే స్టూడెంట్‌ (ఎఫ్‌) వీసా సంపాదించాలి. లేదా కొత్త తాత్కాలిక స్థితికి మారాలి లేదా భారత్‌కు తిరిగి వచ్చేయాలి. లేదంటే యుఎస్‌లో ఉండటానికి చట్టపరమైన హోదా  కోల్పోతే, అమెరికా చట్టాల ప్రకారం చర్యలను  ఎదుర్కోవాల్సి ఉంటుంది.

నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ద్వారా అమెరికా పౌరసత్వం మరియు వలస సేవల (USCIS) డేటా విశ్లేషణ ప్రకారం, ఆధారపడిన వారితో సహా 1.2 మిలియన్లకు పైగా భారతీయులు మొదటి, రెండవ, మూడవ ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ కేటగిరీలలో వేచి ఉన్నారు.  

కాగా జూన్ 13న, ఇమ్మిగ్రేషన్, పౌరసత్వం మరియు సరిహద్దు భద్రతపై సెనేట్ జ్యుడిషియరీ సబ్‌కమిటీ చైర్‌గా ఉన్న సెనేటర్ అలెక్స్ పాడిల్లా నేతృత్వంలోని 43 మంది చట్టసభ సభ్యుల బృందం, ప్రతినిధి డెబోరా రాస్, వీరిని రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని బైడెన్‌ ప్రభుత్వాన్ని కోరారు.

Published date : 30 Jul 2024 09:10AM

Photo Stories