XAT Notification 2025 : జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్–2025 నోటిఫికేషన్ విడుదల.. ఈ ఇన్‌స్టిట్యూట్స్‌లో మేనేజ్‌మెంట్ పీజీ!
ఐఐఎంల్లో అడ్మిషన్స్ కోసం నిర్వహించే క్యాట్ తర్వాత.. ఆ స్థాయి పరీక్షగా నిలుస్తోంది జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఎక్స్‌ఏటీ)!! తాజాగా 2025 సంవత్సరానికిగాను ఎక్స్‌ఏటీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. ఎక్స్‌ఏటీతో ప్రయోజనాలు, పరీక్ష విధానం, సిలబస్ అంశాలు, ప్రిపరేషన్ తదితర వివరాలు..
ప్రముఖ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ.. జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. ఎక్స్‌ఏటీ స్కోర్‌ను జాతీయ స్థాయిలో 250కు పైగా బీ స్కూల్స్ మేనేజ్‌మెంట్ పీజీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
Revanth Reddy: నైపుణ్య శిక్షణకు స్కిల్స్ వర్సిటీ.. తొలిసారిగా ఇన్ని కోర్సులు ప్రారంభం
అర్హతలు
➨ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. కోర్సు చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
➨ ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐలో ప్రవేశం పొందాలనుకునే వారు జూన్ 12, 2025లోపు సర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ పరీక్ష
ఎక్స్‌ఏటీ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. రెండు విభాగాలుగా (పార్ట్–1, పార్ట్–2) పరీక్ష ఉంటుంది. పార్ట్–1లో డెసిషన్ మేకింగ్, వెర్చల్ అండ్ లాజికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్; పార్ట్–2లో జనరల్ నాలెడ్జ్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పార్ట్–3 పేరుతో ఎస్సే రైటింగ్ కూడా ఉంటుంది. మొత్తం 105 ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు లభించే సమయం మూడు గంటల పది నిమిషాలు. వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి గరిష్టంగా 26 ప్రశ్నలు; డెసిషన్ మేకింగ్ నుంచి గరిష్టంగా 22 ప్రశ్నలు; క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి గరిష్టంగా 28 ప్రశ్నలు అడుగుతారు. జనరల్ నాలెడ్జ్ నుంచి 25 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పార్ట్–1లో నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంది. ఎస్సే రైటింగ్‌లో ఏదైనా ఒక అంశంపై 250 పదాల్లో వ్యాసం రాయాల్సి ఉంటుంది.
Telangana Job Calendar: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నేడే జాబ్ కేలండర్, కేబినెట్ కీలక నిర్ణయం
మలి దశలో జీడీ/పీఐ
ఎక్స్‌ఏటీ స్కోర్ ఆధారంగా ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, అనుబంధ ఇన్‌స్టిట్యూట్స్ అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి.. మలిదశలో గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తున్నాయి.
రాత పరీక్షకు సన్నద్ధత ఇలా
వెర్బల్ అండ్ లాజికల్ ఎబిలిటీ
వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ ఎబిలిటీ.. ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు ఉండే విభాగమిది. ఇందులో నిర్దేశిత ప్యాసేజ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నల్లో అధిక శాతం ప్యాసేజ్ సారాంశం అర్థమైతేనే సమాధానం ఇవ్వగలిగేవిగా ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు స్పీడ్ రీడింగ్ అలవాటుతోపాటు ఒక అంశాన్ని చదువుతున్నప్పుడే అందులో కీలకాంశాలను గుర్తించే విధంగా నైపుణ్యం సొంతం చేసుకోవాలి. పంక్చుయేషన్స్ నుంచి ప్యాసేజ్ మెయిన్ కాన్సెప్ట్ వరకూ.. అన్నింటిపై అవగాహన పెంచుకోవాలి. అర్థాలు, సమానార్థాలు, ఫ్రేజెస్, వర్డ్ యూసేజ్, సెంటెన్స్ ఫార్మేషన్ అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. వీటితోపాటు వొకాబ్యులరీపైనా పట్టు సాధించాలి. ఫలితంగా ఆయా ప్యాసేజ్‌లలో వినియోగించిన పదజాలాన్ని వేగంగా అర్థం చేసుకుని.. నిర్దేశిత సమయంలో సమాధానాలిచ్చే నైపుణ్యం లభిస్తుంది.
BFSC Course Admissions : ఏపీ ఫిషరీస్ యూనివర్శిటీలో బీఎఫ్‌ఎస్సీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు.. సీట్ల వివరాలు.!
డేటా ఇంటర్‌ప్రిటేషన్
డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో రాణించడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలి. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో అధిక శాతం ప్రశ్నలు అభ్యర్థులు స్వీయ విశ్లేషణ, సూక్ష్మ పరిశీలన ఆధారంగా సమాధానం రాబట్టేవిగా ఉంటాయి. అంటే.. గ్రాఫ్‌లు, చార్ట్‌లలో ఇచ్చిన దత్తాంశాలపై నేరుగా ప్రశ్నలు అడగకుండా.. సంబంధిత కాన్సెప్ట్‌ను అర్థం చేసుకుని సమాధానం గుర్తించేలా ప్రశ్నలు ఉంటాయి. పర్సంటేజీ, యావరేజెస్‌పై పట్టు సాధించాలి. ఇందుకోసం ఏదైనా స్టాండర్డ్ మెటీరియల్ లేదా ఆన్‌లైన్ టెస్ట్‌లోని ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ కేవలం ఒకే తరహా ప్రశ్నలు కాకుండా.. విభిన్న క్లిష్టతతో కూడిన సమస్యలను సాధించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
క్వాంటిటేటివ్ ఎబిలిటీ
మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అంశాలతో ఉండే విభాగం ఇది. ఇందులో రాణించడానికి వేగం ముఖ్యం. కాబట్టి కాలిక్యులేషన్స్ వేగంగా చేయగలిగే నేర్పు సొంతం చేసుకోవాలి. నాన్–మ్యాథ్స్ అభ్యర్థులు ప్రాబబిలిటీ అండ్ పెర్ముటేషన్స్/ కాంబినేషన్స్, నెంబర్స్, అల్‌జీబ్రా, జామెట్రీ విభాగాలపై దృష్టి పెట్టాలి. వీటికి సంబం«ధించిన బేసిక్ కాన్సెప్ట్స్‌పై పట్టు సాధించాలి. ప్రస్తుత సమయంలో సబ్జెక్ట్ ప్రిపరేషన్‌తోపాటు ఆయా సెక్షన్లలో ప్రీవియస్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.
GDS Posts Notification : 44,228 జీడీఎస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేకుండానే..
జనరల్ నాలెడ్జ్
ఈ విభాగానికి జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి సమకాలీనంగా ప్రాధాన్యం సంతరించుకున్న అంతర్జాతీయ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా ఆర్థిక, వ్యాపార, వాణిజ్య రంగాలకు సంబంధించిన తాజా పరిణామాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.
జీడీ/పీఐ
ఎక్స్‌ఏటీ స్కోర్ ఆధారంగా మలి దశ ఎంపిక ప్రక్రియలో నిర్వహించే గ్రూప్ డిస్కష¯Œ కోసం అభ్యర్థులు కోర్ నుంచి కాంటెంపరరీ వరకు.. పలు అంశాలపై పట్టు సాధించాలి. గ్రూప్ డిస్కషన్‌లో ప్రతిభ ఆధారంగా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సదరు విద్యార్థికి మేనేజ్‌మెంట్ విద్య పట్ల ఉన్న వాస్తవ ఆసక్తి, అతని భవిష్యత్తు లక్ష్యాలు, వాటిని అందుకునేందుకు ఎంపిక చేసుకున్న మార్గాలు తదితర అంశాలను ఇంటర్వ్యూలో పరిశీలిస్తారు.
Paris Olympics: ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకం సాధించిన స్వప్నిల్ కుసాలే
ముఖ్య సమాచారం
➨ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
➨ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, నవంబర్ 30
➨ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: 2024, డిసెంబర్ 20 నుంచి
➨ ఎక్స్‌ఏటీ తేదీ: 2025, జనవరి 5
➨ వెబ్‌సైట్: https://xatonline.in
Tags
- XAT Notification
- Entrance Exam
- admissions
- online applications
- Post Graduation Admissions
- Xavier Aptitude Test
- Xavier Aptitude Test notification
- XAT Entrance Exam Tips
- online exam
- Eligible Candidates
- XLRI management institute
- XAT National Level rank
- Education News
- Sakshi Education News
- XAT2025Benefits
- XATExamProcedure
- XAT Syllabus
- XATPreparationTips
- XATAdmission
- XAT details
- XATNotification
- XATApplication
- XATExamPattern
- study strategies