Skip to main content

Telangana Job Calendar: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నేడే జాబ్‌ కేలండర్‌, కేబినెట్‌ కీలక నిర్ణయం

Job calendar release event in Hyderabad  CM Revanth Reddy announcing job calendar  Telangana Job Calendar  Hyderabad job calendar announcement State government job calendar release

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తు న్న జాబ్‌ కేలండర్‌ మరికొన్ని గంటల్లో వెలువడనుంది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచి్చన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం శాసనసభ వేదికగా జాబ్‌ కేలండర్‌ను ప్రకటించనుంది. ఇకపై ఏటా యూపీఎస్సీ తరహాలో ప్రణాళికాబద్ధంగా తేదీలవారీగా ఉద్యోగ నియామకాల ప్రకటనలు జారీ చేయనుంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో జాబ్‌ కేలండర్‌ను ప్రకటించనున్నారు. 

SSC Jobs Application Date Extended 2024 : 8,326 ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు..

సీఎం రేవంత్‌ అధ్యక్షతన గురువారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో జాబ్‌ కేలండర్‌ సహా పలు  అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు.

మేని ఫెస్టోలో ప్రకటించిన జాబ్‌ కేలండర్‌కు చట్టబద్ధత కల్పించడానికి శాసనసభలో ప్రకటిస్తున్నామని పొంగులేటి తెలిపారు. ఈ అంశంపై చర్చలో ప్రతిపక్షాలు చేసే సూచనలను పరిగణనలోకి తీసుకొని తగిన మార్పులు చేసేందు కు సిద్ధమన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పును ఇప్పటికే ప్రకటించిన గ్రూప్‌–1, గ్రూప్‌–2, గ్రూప్‌–3 నోటిఫికేషన్లకు వర్తింపజేసేందుకు త్వరలో ఆర్డినెన్స్‌ తీసుకురావాలని సీఎం నిర్ణయించినట్లు చెప్పారు. 

Job Calender

Good news Telangana Anganwadis: అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి

Published date : 02 Aug 2024 12:24PM

Photo Stories