Skip to main content

GDS Posts Notification : 44,228 జీడీఎస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌.. రాత ప‌రీక్ష లేకుండానే..

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో గ్రామీణ డాక్‌ సేవక్‌ (జీడీఎస్‌) ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. దేశవ్యాప్తంగా 44,228 జీడీఎస్‌ పోస్టులను భర్తీ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే పదో తరగతిలో సాధించిన మెరిట్‌ మార్కులతో పోస్టల్‌ శాఖలో కొలువు సొంతం చేసుకోవచ్చు.
Notification for filling 44,228 Grameen Doc Sevak vacancies  Advertisement for Grameen Dak Sevak (GDS) vacancies in postal circles  Grameen Dak Sevak (GDS) recruitment notice for 44,228 posts  GDS job opportunities across various postal circles  Vacancy announcement for Grameen Dak Sevak positions in postal department Recruitment for Grameen Dak Sevak posts based on 10th class merit marks

ఎంపికైన వారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం) హోదాలతో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. 
➨    మొత్తం ఖాళీల సంఖ్య: 44,228 (ఆంధ్రప్రదేశ్‌–1355, తెలంగాణలో 981 ఖాళీలు)
అర్హత
పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష తప్పనిసరిగా ఉండాలి. ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదోతరగతి వరకు చదవాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానంతోపాటు సైకిల్‌ తొక్కడ వచ్చి ఉండాలి.
వయసు
జీడీఎస్‌ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు 18–40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల గరిష్ట సడలింపు లభిస్తుంది.

R Vishnuvardhan: స్వాతంత్య్ర వేడుకలకు కిష్టాపూర్‌ విద్యార్థి

ఎంపిక ఇలా
అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఖాళీలున్న బ్రాంచ్‌లు, రిజర్వ్‌డ్‌/అన్‌ రిజర్వ్‌డ్‌ తదితర వివరాలు పేర్కొన్నారు. అభ్యర్థులు వాటిని పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యానికి ఆప్షన్‌–1, ఆ తర్వాత దానికి ఆప్షన్‌–2.. ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్‌ కేటాయిస్తారు.
వేతనాలు
బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం)పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.12,000–రూ.29,380 వేత­నం అందుతుంది. అలాగే అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌/డాక్‌ సేవక్‌గా నియమితులైన వారికి నెల­కు రూ.10,000–రూ.24,470 వేతనం లభిస్తుంది. 
వీటితో పాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్స్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలోప్రోత్సాహకం అందిస్తారు. స్వల్పమొత్తంలో హెచ్‌ఆర్‌ఏ కూడా దక్కుతుంది. వీరు రోజూవారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్‌/కంప్యూటర్‌/స్మార్ట్‌ఫోన్‌ లాంటివి పోస్టల్‌శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. 

WHO: బీఈ పోలియో వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు

విధులు ఇలా
➨    బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (బీపీఎం): వీరు బ్రాంచ్‌ కార్యకలపాలను పర్యవేక్షించాలి. పోస్టల్‌ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్‌ లావాదేవీలు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా ఉత్తరాల పంపిణీ జరిగేలా పర్యవేక్షించాలి. పోస్టల్‌కు సంబంధించిన మార్కెటింగ్‌ వ్యవహారాలూ చక్కబెట్టాలి. బృందనాయకుడిగా సంబంధిత బ్రాంచ్‌ను నడిపించాలి. పోస్టల్‌ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
➨    అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం): ఈ పోస్టులకు ఎంపికైన వారు స్టాంపులు/స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ, ఇండియన్‌ పోస్టు పేమెంట్స్‌ బ్యాంకుకు సంబంధించిన డిపాజి­ట్లు, పేమెంట్లు, పోస్టల్‌కు సంబంధించిన ఇతర వ్యవహారాలు చక్కబెట్టాలి. బ్రాంచ్‌ పోస్టు మాస్ట­ర్‌ చెప్పిన పనులు పూర్తిచేయాలి. తపాలా స్కీ­ముల గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి.
ముఖ్యసమాచారం
➨    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 
➨    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2024, ఆగస్టు 05
➨    దరఖాస్తు సవరణ తేదీలు: 2024, ఆగస్టు 6–8 వరకు;
➨    వెబ్‌సైట్‌: https://indiapostgdsonline.gov.in

Paris Olympics: ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకం సాధించిన‌ స్వప్నిల్ కుసాలే

Published date : 02 Aug 2024 10:54AM

Photo Stories