Kaushal Exam: కౌశల్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
బాపట్ల అర్బన్: భారతీయ విజ్ఞాన మండలి, ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి సంయుక్త ఆధ్వర్యంలో కౌశల్– 2023 పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డీఈఓ పీవీజే రామారావు తెలిపారు. స్థానిక కార్యాలయంలో కౌశల్– 2023 పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లా డుతూ కౌశల్ సైన్స్ క్విజ్ పోటీలకు 8,9,10 తరగతుల విద్యార్థులతో క్విజ్ టీమ్ ఏర్పడాలని, ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమేనని వెల్లడించారు.
ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు త ప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 8,9,10 తరగతుల గణితం, సైన్స్ ‘విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయుల కృషి మెటీరియల్‌గా నిర్ణయించారని తెలిపారు. ప్రథమ బహుమతిగా రూ.7.500, ద్వితీ య బహుమతిగా రూ.6వేలు, తృతీయ రూ.4,500 అందిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో విజేతలకు ప్రథమ బహుమతి రూ.15 వేలు, ద్వితీయ రూ. 12 వేలు, తృతీయ రూ.9 వేలు అందిస్తున్నార ని తెలిపారు.
రాష్ట్ర స్థాయిలో కన్సొలేషన్ బహుమ తులుగా రూ.6 వేలు చొప్పున బహుకరిస్తారన్నారు. పాఠశాల కో–ఆర్డినేటర్లు నవంబర్ 5వ తేదీలోగా విద్యార్థుల పేర్లను డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.బీవీఎం.ఏపీడాట్ ఓఆర్‌జీలో నమోదు చేసుకోవాలని సూచించారు. పోస్టర్ ప్రజెంటేషన్ లో 8, 9 తరగతుల నుంచి ఇద్దరిని అనుమతిస్తామని వెల్లడించారు. వివరాలకు 8121445688 నంబర్ ను గానీ, కౌశల్ జిల్లా కో ఆర్డినేటర్ పావని భానుచంద్రమూర్తి, జిల్లా సైన్‌న్స్ అధికారి సాధిక్ మహమ్మద్, నోడల్ అధికారి సికిందర్ మీర్జాన్‌లను సంప్రదించాలని చెప్పారు.