Skip to main content

CTET 2023 Notification: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేష‌న్ రిలీజ్‌... ద‌ర‌ఖాస్తు విధానం ఇదే

ఉపాధ్యాయ వృత్తిని కెరీర్‌గా ఎంచుకునే వారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నిర్వహిస్తారు. ఈ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్​ఈ) నిర్వహిస్తోంది. సీటెట్​ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుంది. తాజాగా జులై-2023 ఏడాదికి సంబంధించిన సీటెట్​ నోటిఫికేషన్​ విడుదలైంది రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు కొనసాగనుంది. ప‌రీక్ష పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే రాయాల్సి ఉంటుంది.
CTET-Notification
CTET-Notification

పేపర్-1: పన్నెండో తరగతితో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా(డీఈఎల్‌ఈడీ)/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

పేపర్-2: బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ బీఈడీ/ బీఈడీ(ప్రత్యేక విద్య) లేదా సీనియర్‌ సెకండరీతో పాటు  బీఈఎల్‌ఈడీ/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

చ‌ద‌వండి: ఫిల్మ్‌ఫేర్‌లో నిరాశ‌ప‌రిచిన‌ క‌శ్మీరీఫైల్స్‌... ఉత్తమ నటిగా అలియా భట్

దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ కేటగిరీలకు రూ.1000(పేప‌ర్ 1, లేదా 2 ఏదో ఒక‌దానికి మాత్ర‌మే), పేపర్ 1 & 2 రెండింటికి రూ.1200. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు: రూ.500(పేప‌ర్ 1, లేదా 2 ఏదో ఒక‌దానికి మాత్ర‌మే), రెండింటికి రూ.600 

CTET Notification

పరీక్ష కేంద్రాలు: అనంతపురం, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నరసరావుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, హైదరాబాద్.

చ‌ద‌వండి: ఇంట‌ర్‌లో మెరిసిన పేదింటి క‌లువ‌లు... ప్రైవేటుకు దీటుగా మార్కులు సాధించిన ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల‌ విద్యార్థులు

దరఖాస్తు మొద‌లు: 26-04-2023.
తుది గ‌డువు: 26-05-2023.
 
పరీక్ష తేదీలు: జులై, 2022 నుంచి ఆగస్టు, 2023 మధ్య.

ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు, పూర్తి వివ‌రాల కోసం https://ctet.nic.in/ క్లిక్ చేయండి

Published date : 28 Apr 2023 03:32PM
PDF

Photo Stories