CTET 2024 Answer Key Released: సీటెట్ ప్రాథమిక కీ విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ(CBSE) ఏటా నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(CTET) ప్రాథమిక కీ విడుదలయ్యింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. సీటెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆన్సర్ కీపై అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. కీపై అభ్యంతరాలు ఉంటే ఒక్కో ప్రశ్నకు రూ.1000 చొప్పున (నాన్ రిఫండ్) చెల్లించాల్సి ఉంటుంది. కాగా జనవరి 21న దేశవ్యాప్తంగా 135 నగరాల్లో,,418 పరీక్షా కేంద్రాల్లో సీటెట్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.
సీటెట్ స్కోరు.. వాలిడిటీ ఎంత వరకు?
బోర్డు సమాచారం ప్రకారం 26,93,526 మంది అభ్యర్థులు రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకోగా వారిలో 84 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. సీటెట్ స్కోరుతో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ పోస్టులకూ దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, కేంద్ర స్థాయి విద్యా సంస్థల్లో అంటే కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఆర్మీ స్కూళ్లు మొదలైన వాటిల్లో ఉపాధ్యాయుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా సీటెట్ ఉత్తీర్ణులై ఉండాలి. సీటెట్‌లో సాధించిన స్కోర్‌కు జీవిత కాల వాలిడిటీ ఉంటుంది.
CTET 2024 ఆన్సర్ కీ.. ఇలా చెక్ చేసుకోండి.
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్https://ctet.nic.in/ను సంప్రదించండి.
2. హోం పేజీలో కనిపిస్తున్న CTET Jan 2024 అనే దానిపై క్లిక్ చేయండి.
3. లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పాస్‌వర్డ్ నమోదు చేయాలి.
4. తర్వాత సైన్ ఇన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి CTET ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోండి