Filmfare Awards 2023: ఫిల్మ్‌ఫేర్‌లో నిరాశపరిచిన కశ్మీరీఫైల్స్... ఉత్తమ నటిగా అలియా భట్... గంగూబాయి కాఠియావాడికి అవార్డుల పంట.. పూర్తి జాబితా ఇదే
ఆ తర్వాత ఉత్తమ నటుడు సహా ఆరు కేటగిరీల్లో ‘బదాయ్ దో’ను ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వరించాయి. భాషతో సంబంధం లేకుండా యువతను విశేషంగా అలరించిన ‘బ్రహ్మాస్త్ర: పార్ట్-1’లోని ‘కేసరియా’ పాటకు ఉత్తమ సాహిత్య, గాయకుడి అవార్డులను అందుకుంది. అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న జాబితాలో ఉన్న ‘ది కశ్మీర్ ఫైల్స్’కు ఒక్క అవార్డు రాకపోవడం గమనార్హం.
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ -2023 విజేతలు వీరే..
► ఉత్తమ చిత్రం - గంగూబాయి కథియావాడి
► ఉత్తమ దర్శకుడు - సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కథియావాడి)
► ఉత్తమ చిత్రం(క్రిటిక్స్) - బదాయ్ దో (హర్షవర్ధన్ కులకర్ణి)
► ఉత్తమ నటి - ఆలియా భట్ (గంగూబాయి కథియావాడి)
► ఉత్తమ నటి (క్రిటిక్స్) - టబు (భూల్ భులాయా 2), భూమి పెడ్నేకర్ (బదాయి దో)
► ఉత్తమ నటుడు - రాజ్ కుమార్ రావు (బదాయి దో)
చదవండి: సొంత ప్రిపరేషన్‌తో రైల్వే టీసీగా ఎంపికైన రైతు బిడ్డ
► ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - సంజయ్ మిశ్రా (వధ్)
► ఉత్తమ సహాయ నటుడు - అనిల్ కపూర్ (జుగ్ జుగ్ జియో)
► ఉత్తమ సహాయ నటి -షీబా చద్దా (బదాయి దో)
► ఉత్తమ గీత రచయిత - అమితాబ్ భట్టాచార్య (బ్రహ్మాస్త్ర 1లోని కేసరియా పాట)
► ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ - ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర 1)
► ఉత్తమ నేపథ్య గాయకుడు - అర్జిత్ సింగ్ (బ్రహ్మాస్త్ర 1లోని కేసరియా పాట)
► ఉత్తమ నేపథ్య గాయని - కవిత సేత్ (జుగ్‌జుగ్ జియోలోని రంగిసారి.. పాట)
► ఉత్తమ కథ - అక్షత్ గిల్డయల్, సుమన్ అధికారి (బదాయి దో)
► ఉత్తమ స్క్రీన్‌ప్లే - అక్షత్ గిల్డయల్, సుమన్ అధికారి, హర్షవర్ధన్ కులకర్ణి (బదాయి దో)
► ఉత్తమ సంభాషణలు - ప్రకాశ్ కపాడియా, ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కథియావాడి)
► ఉత్తమ బ్యాగ్రౌండ్ స్కోర్ - సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా (గంగూబాయి కథియావాడి)
► ఉత్తమ సినిమాటోగ్రఫీ - సుదీప్ చటర్జీ (గంగూబాయి కథియావాడి)
► ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సుబ్రత చక్రవర్తి, అమిత్ రాయ్ (గంగూబాయి కథియావాడి)
► ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - షీతల్ ఇక్బాల్ శర్మ (గంగూబాయి కథియావాడి)
► ఉత్తమ సౌండ్ డిజైన్ - బిశ్వదీప్ దీపక్ చటర్జీ (బ్రహ్మాస్త్ర 1)
► ఉత్తమ ఎడిటింగ్ - నీనద్ కలంకార్ (ఎన్ యాక్షన్ హీరో)
► ఉత్తమ యాక్షన్ - పర్వేజ్ షైఖ్ (విక్రమ్ వేద)
చదవండి: విద్యార్థులకు ఉచితంగా బ్రేక్ ఫాస్ట్... సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
► ఉత్తమ వీఎఫ్‌ఎక్స్ - డీఎన్‌ఈజీ, రెడిఫైన్ (బ్రహ్మాస్త్ర 1)
► ఉత్తమ కొరియోగ్రఫీ - కృతి మహేశ్ (డోలిడా- గంగూబాయ్ కథియావాడి)
► ఉత్తమ డెబ్యూ దర్శకుడు - జస్పల్ సింగ్ సంధు, రాజీవ్ బర్న్‌వల్ (వధ్)
► ఉత్తమ డెబ్యూ హీరో - అంకుశ్ గదం (ఝండ్)
► ఉత్తమ డెబ్యూ హీరోయిన్ - ఆండ్రియా కెవిచుసా (అనేక్)
► జీవిత సాఫల్య పురస్కారం - ప్రేమ్ చోప్రా
► ఆర్‌డీ బర్మన్ అవార్డ్ - జాన్వీ శ్రీమంకర్ (డోలిడా- గంగూబాయి కథియావాడి)