ANR National Awards 2024: ANR అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
Sakshi Education
అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి, జాతీయ అవార్డు వేడుకలు అక్టోబర్ 28వ తేదీ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగాయి.
![Megastar Chiranjeevi Received ANR National Award By Amitabh Bachchan](/sites/default/files/images/2024/10/29/anr-award-1730181634.jpg)
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి ‘ఏఎన్నార్ జాతీయ అవార్డు’ను అందుకున్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘పద్మభూషణ్‌లు, పద్మ విభూషణ్‌లు, పర్సనాలిటీ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు.. ఇలా ఎన్ని అవార్డులు వచ్చినా.. ఏఎన్‌ఆర్ అవార్డు నాకు ప్రత్యేకం. ఎందుకంటే నా వాళ్లు నన్ను గుర్తించి, ప్రశంసించి, ఇలాంటి అవార్డులు ఇచ్చినప్పుడు అది నిజమైన అచీవ్‌మెంట్ అని ఫీలయ్యాను. అందుకే నాకు ఇది ప్రత్యేకమైన అవార్డు’ అని చెప్పాడు.
భారతీయ సినీ రంగంలో బాద్షా లాంటి అమితాబ్చన్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం ఎంతో గర్వంగా ఉందని చిరంజీవి అన్నారు.
National Film Awards: 70వ నేషనల్ సినీ అవార్డ్స్.. ఎవరెవరికి అవార్డులు వచ్చాయంటే?
Published date : 29 Oct 2024 11:30AM